Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 27 OTSA

Show OTSA only
Verse × ×
1 Do not boast about tomorrow, for you do not know what a day may bring. రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.
2 Let someone else praise you, and not your own mouth; a stranger, and not your own lips. నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి.
3 A stone is heavy and the sand a burden, but a fool's provocation is heavier than both. రాయి భారం ఇసుక ఒక భారం, మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము.
4 Wrath is cruel and anger is overwhelming, but who can stand before jealousy? కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?
5 Open rebuke is better than love that stays hidden. అంతరంగంలో ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
6 A friend's wounds are faithful, but an enemy's kisses are deceitful. స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.
7 A well-fed person tramples honeycomb, but to the hungry even what is bitter tastes sweet. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తియ్యగా ఉంటుంది.
8 A man who strays from his home is like a bird that strays from its nest. తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు.
9 Oil and incense gladden the heart, and the sweetness of a friend comes from heartfelt counsel. అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, స్నేహితుని వల్ల కలిగే వినోదం వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది.
10 Do not forsake your friend or your father's friend, and do not go to your brother's house when disaster strikes; better a neighbor nearby than a brother far off. నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.
11 Be wise, my son, and make my heart glad, so that I can answer anyone who taunts me. నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము; అప్పుడు నిన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
12 The prudent sees danger and takes cover, but the simple keep going and pay the price. వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
13 Take the garment of one who puts up security for a stranger; hold it as collateral when he does so for a foreign woman. అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
14 Whoever blesses his neighbor with a loud voice early in the morning, it will be taken as a curse. ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే, అది శాపంగా పరిగణించబడింది.
15 A quarrelsome wife is like a constant dripping on a rainy day. ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము.
16 Restraining her is like restraining the wind, or grasping oil with the right hand. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొను వానితోను సమానుడు.
17 Iron sharpens iron, and one person sharpens another. ఇనుము చేత ఇనుము పదునైనట్లు ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు.
18 Whoever tends a fig tree will eat its fruit, and whoever guards his master will be honored. అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు, తన యజమానుని క్షమించేవాడు ఘనత పొందుతాడు.
19 As water reflects the face, so the heart reflects the person. నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు, మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.
20 The grave and Destruction are never satisfied, and a person's eyes are never satisfied. పాతాళానికి, లోతైన గుంటకును తృప్తికానేరదు. అలాగున మనుష్యుల చూపు తృప్తికానేరదు.
21 The crucible is for silver and the furnace for gold, and a person is tested by the praise he receives. వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు.
22 Though you grind a fool in a mortar with a pestle, along with the grain, his foolishness will not leave him. బుద్ధిహీనున్ని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే వాని మూర్ఖత్వం వదిలిపోదు.
23 Know well the condition of your flocks, and give careful attention to your herds. నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు;
24 For riches do not last forever, nor does a crown endure to every generation. ఐశ్వర్యం శాశ్వతం కాదు, కిరీటం తరతరాల వరకు ఉండదు.
25 When the grass is gone and the new growth appears and the mountain herbs are gathered, ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు. కొండ మీది నుండి గడ్డిని పోగుచేసినప్పుడు.
26 the lambs will provide your clothing, and the goats will provide the price of a field; నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి ఒక చేను కొను డబ్బుకు మేకపోతులు సరిపోతాయి.
27 and there will be enough goats' milk for your food, for the food of your household and to sustain your servant girls. నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి నీ పనికత్తెల పోషణలు మేకపాలు సమృద్ధి అవుతాయి.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]