Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 26 OTSA

Show OTSA only
Verse × ×
1 Like snow in summer and like rain at harvest, honor is not fitting for a fool. వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు.
2 Like a fluttering sparrow or a darting swallow, an undeserved curse does not come to rest. ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు.
3 A whip for the horse, a bridle for the donkey, and a rod for the backs of fools. గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం, బుద్ధిహీనుని వీపుకు బెత్తం!
4 Do not answer a fool according to his foolishness, or you yourself will be like him. వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు.
5 Answer a fool according to his foolishness, or he will be wise in his own eyes. వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు.
6 Whoever sends a message through a fool cuts off his own feet and drinks down violence. బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు, కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు.
7 Like the legs of a lame man hanging useless is a proverb in the mouth of fools. కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు.
8 Like binding a stone in a sling is giving honor to a fool. బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు.
9 Like a thornbush in the hand of a drunkard is a proverb in the mouth of fools. బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును.
10 Like an archer who wounds everyone is one who hires a fool or hires any passerby. యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును.
11 As a dog returns to its vomit, so a fool repeats his foolishness. తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.
12 Do you see someone wise in his own eyes? There is more hope for a fool than for him. తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.
13 The lazy person says, "There is a lion in the road! A lion in the streets!" సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!”
14 As a door turns on its hinges, so the lazy person turns on his bed. కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు.
15 The lazy person buries his hand in the dish; it wearies him to bring it back to his mouth. సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
16 The lazy person is wiser in his own eyes than seven who answer wisely. కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు.
17 Like grabbing a dog by the ears is a passerby who meddles in a quarrel not his own. తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు.
18 Like a madman shooting firebrands, arrows, and death, తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు.
19 so is the one who deceives his neighbor and says, "I was only joking!" Not in this edition
20 Without wood a fire goes out, and without a gossip a quarrel dies down. కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది.
21 As charcoal to embers and wood to fire, so a quarrelsome person kindles strife. నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో గొడవలు రేపడానికి గొడవప్రియుడు.
22 The words of a gossip are like choice morsels; they sink down into the inmost parts. పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.
23 Like a glaze covering an earthen pot are smooth lips with an evil heart. చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి.
24 An enemy disguises himself with his lips, but in his heart he harbors deceit. పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు.
25 When he speaks graciously, do not believe him, for seven abominations fill his heart. వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి.
26 Though his hatred is hidden by deceit, his wickedness will be exposed in the assembly. వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది.
27 Whoever digs a pit will fall into it, and a stone rolls back on the one who rolls it. గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది.
28 A lying tongue hates those it crushes, and a flattering mouth works ruin. అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]