Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 3 OTSA

Side by side with the Father's Heart Bible™

యోబు మాటలు

1ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు. 2యోబు ఇలా అన్నాడు:

3“నేను పుట్టిన రోజు,‘మగ శిశువు పుట్టాడని!’ చెప్పిన ఆ రాత్రి లేకపోవును గాక.

4ఆ రోజు చీకటి అగును గాక;పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక;దాని మీద వెలుగు ప్రకాశించకూడదు.

5చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక;మేఘం దాన్ని కమ్మును గాక;పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక.

6కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక;సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక,ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక.

7ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక;దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక.

8రోజులను శపించేవారు, లెవియాథన్ రెచ్చగొట్టే అనుభవం గలవారుఆ రోజును శపించుదురు గాక.

9దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక;వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి,ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు.

10ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికినా తల్లి గర్భద్వారాలను మూయలేదు.

11“పుట్టగానే నేనెందుకు చావలేదు?గర్భం నుండి రాగానే నేనెందుకు మరణించలేదు?

12నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారునేనెందుకు తల్లిపాలు త్రాగాను?

13నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే;నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని,

14తమ కోసం భవనాలు కట్టుకున్నభూరాజులతో పాలకులతో,

15బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్నఅధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని.

16లేదా చనిపోయి పుట్టిన పిండంవలెఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు?

17అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపెట్టరు,బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.

18చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు,యాజమానుల స్వరాలు వారికిక వినబడవు.

19పేదవారు గొప్పవారు అక్కడ ఉన్నారు,దాసులు తమ యాజమానుల నుండి విముక్తి పొందుతారు.

20“దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు?ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు?

21వారు రాని మరణం కోసం ఆశతో ఎదురుచూస్తారు,దాచబడిన ధననిధి కంటే ఎక్కువగా దాని కోసం వెదకుతారు, కాని అది రాదు.

22వారు సమాధిని చేరినప్పుడుఆనందంతో నింపబడి సంతోషిస్తారు.

23మరుగుచేయబడిన మార్గంగలవానికిదేవుడు చుట్టూ కంచెవేసినవానికిజీవం ఎందుకు ఇవ్వబడింది?

24నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది.నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి.

25దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది;దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది.

26నాకు నెమ్మది లేదు సుఖం లేదు;విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]