Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 17 OTSA

Show OTSA only
Verse × ×
1 "My spirit is broken, my days are snuffed out, the grave is ready for me. “నా ప్రాణం క్రుంగిపోయింది, నా రోజులు కుదించబడ్డాయి. సమాధి నా కోసం ఎదురుచూస్తుంది.
2 Surely mockers surround me, and my eyes cannot look away from their taunting. ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు; నేను చూస్తూ ఉండగానే వారు వివాదం రేపుతున్నారు.
3 "Put up a pledge for me with yourself; who else will give their word as my guarantor? “దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి. ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు?
4 For you have closed their minds to understanding; therefore you will not let them triumph. గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు. కాబట్టి మీరు వారిని విజయం పొందనివ్వరు.
5 One who denounces friends for personal gain—the eyes of his children will fail. స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే వారి పిల్లల కళ్లు మసకబారతాయి.
6 "He has made me a byword among the peoples, someone they spit in the face. “దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు, నా ముఖం మీద ప్రజలు ఉమ్మివేస్తారు.
7 My eye has grown dim from grief, and all my limbs are like a shadow. దుఃఖంతో నా చూపు మందగించింది. నా అవయవాలు నీడలా మారాయి.
8 The upright are appalled at this, and the innocent is roused against the godless. యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు; నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు.
9 Yet the righteous holds to his way, and the one with clean hands grows stronger and stronger. అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు.
10 "But come back, all of you, come now—I find not one wise man among you. “మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి! నాకు మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించలేదు.
11 My days are past, my plans are broken off, and with them the desires of my heart. నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. నా హృదయ వాంఛలు భంగమయ్యాయి.
12 They turn night into day; 'light,' they say, 'is near'—in the face of darkness. ఈ మనుష్యులు రాత్రిని పగలని, చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు.
13 If I hope for the grave as my house, if I spread my bed in the darkness, నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి, చీకటిలో నా పరుపు పరచుకోవాలి.
14 if I call to the pit, 'You are my father,' and to the worm, 'My mother' and 'My sister,' నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని, పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే,
15 where then is my hope? Who can see any hope for me? అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు! నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా?
16 Will it go down to the gates of the grave? Will we descend together into the dust?" అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా? నాతో పాటు మట్టిలో కలిసిపోదా?”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]