Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 2 OTSA

Side by side with the Father's Heart Bible™

యెహోవా పర్వతం

1యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం:

2చివరి రోజుల్లోయెహోవా మందిరంపర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది;అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది,జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.

3చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు,“రండి, మనం యెహోవా పర్వతం మీదికి,యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము.మనం ఆయన మార్గంలో నడిచేలా,ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.”సీయోనులో నుండి ధర్మశాస్త్రం,యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.

4ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు,అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు.వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా,తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు.ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు,వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.

5యాకోబు వారసులారా రండి,మనం యెహోవా వెలుగులో నడుద్దాము.

యెహోవా దినం

6యెహోవా, యాకోబు వారసులైనమీ ప్రజలను మీరు విడిచిపెట్టారు.వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు;వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు,ఇతరుల ఆచారాలను పాటిస్తారు.

7వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది;వారి ధనానికి అంతులేదు.వారి దేశం గుర్రాలతో నిండి ఉంది;వారి రథాలకు అంతులేదు.

8వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది.వారు తమ చేతులతో చేసిన వాటికి,తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు.

9కాబట్టి ప్రజలు అణచివేయబడతారుప్రతి ఒక్కరు తగ్గించబడతారువారిని క్షమించకండి.

10యెహోవా భీకర సన్నిధి నుండి,ఆయన ప్రభావ మహాత్మ్యం నుండిబండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.

11మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది,మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది;ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.

12సైన్యాల యెహోవాఅహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసంహెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు.(అవి అణచివేయబడతాయి),

13ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి,బాషాను సింధూర వృక్షాలన్నిటికి,

14పెద్ద పర్వతాలన్నిటికి,ఎత్తైన కొండలన్నిటికి

15ఉన్నతమైన ప్రతి గోపురానికిప్రతి కోటగోడకు,

16ప్రతీ వాణిజ్య నౌకకుమనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.

17మనుష్యుల అహంకారం అణచివేయబడుతుందిమానవుల గర్వం తగ్గించబడుతుంది;ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.

18విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.

19యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు,ఆయన భీకర సన్నిధి నుండిఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయివారు కొండల గుహల్లోనేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.

20ఆ రోజున మనుష్యులుతాము పూజించడానికి తయారుచేసుకున్నవెండి విగ్రహాలను బంగారు విగ్రహాలనుఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.

21యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు,ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయిఆయన ప్రభావ మహాత్మ్యం నుండివారు కొండల గుహల్లోబండ బీటల్లో దాక్కుంటారు.

22తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేనినరులను నమ్మడం మానండి.వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]