Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Hosea 5 OTSA

Side by side with the Father's Heart Bible™

ఇశ్రాయేలుపై తీర్పు

1“యాజకులారా! ఇది వినండి,ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి,రాజ వంశస్థులారా! వినండి,ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది:మీరు మిస్పాలో ఉరిగా,తాబోరు మీద వలలా ఉన్నారు.

2తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు.వారందరిని నేను శిక్షిస్తాను.

3ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు;ఇశ్రాయేలు నా నుండి దాచబడలేదు.ఎఫ్రాయిమూ! ఇప్పుడు నీవు వ్యభిచారం వైపు తిరిగావు;ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.

4“వారి పనుల వలనవారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు.వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది;వారు యెహోవాను గుర్తించరు.

5ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది;ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు;యూదా కూడా వారితో తడబడుతుంది.

6వారు యెహోవాను వెదకడానికితమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు,ఆయనను కనుగొనరు;ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు.

7వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు;వారు అక్రమ సంతానాన్ని కన్నారు.వారు అమావాస్య ఉత్సవాలు జరుపుకున్నప్పుడు,ఆయన వారి భూములను నాశనం చేస్తారు.

8“గిబియాలో బాకానాదం చేయండి,రామాలో బూర ఊదండి.బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము;బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి.

9దండన రోజునఎఫ్రాయిం పాడైపోతుంది.తప్పనిసరిగా జరగబోయే దానినినేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను.

10యూదా నాయకులుసరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు.వారి మీద నా కోపాన్నినీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను.

11ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టివారు హింసించబడతారు,తీర్పులో త్రొక్కబడతారు.

12నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను,యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను.

13“ఎఫ్రాయిం తన రోగాన్ని,యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు,ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగిగొప్ప రాజును సహాయం కోరాడు.అయితే అతడు నిన్ను బాగుచేయలేదు,నీ పుండ్లను స్వస్థపరచలేదు.

14ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలాయూదాకు కొదమసింహంలా ఉంటాను.నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను;వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.

15వారు తమ అపరాధం ఒప్పుకునినన్ను వెదికే వరకునేను నా స్థలానికి తిరిగి వెళ్తాను,వారు తమ దురవస్థలోనన్ను తీవ్రంగా వెదకుతారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]