Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Amos 3 OTSA

Side by side with the Father's Heart Bible™

ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పిలువబడిన సాక్షులు

1ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:

2“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండిమిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను.కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టినేను మిమ్మల్ని శిక్షిస్తాను.”

3పరస్పర సమ్మతి లేకుండాఇద్దరూ కలిసి నడుస్తారా?

4ఆహారం దొరకక పోతే,సింహం అడవిలో గర్జిస్తుందా?దేనినీ పట్టుకోకుండానేఅది దాని గుహలో గుర్రుమంటుందా?

5నేల మీద ఎరపెట్టనిదే,పక్షి ఉరిలో చిక్కుకుంటుందా?ఉరిలో ఏదీ చిక్కకపోతే,ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా?

6పట్టణంలో బూరధ్వని వినబడితే,ప్రజలు వణకరా?పట్టణంలో విపత్తు వచ్చినప్పుడుఅది యెహోవా పంపింది కాదా?

7తన సేవకులైన ప్రవక్తలకుతన ప్రణాళికను తెలియజేయకుండాప్రభువైన యెహోవా ఏదీ చేయరు.

8సింహం గర్జించింది,భయపడని వారెవరు?ప్రభువైన యెహోవా చెప్పారుదానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?

9అష్డోదు కోటలకు ఇలా చాటించండి,ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి:“సమరయ పర్వతాలమీద కూడుకోండి;దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని,దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.”

10“సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,”అని యెహోవా చెప్తున్నారు,“వారు తమ కోటలలోతాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”

11కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:“శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు,మీ దుర్గాలను పడగొడతాడు,మీ కోటలను దోచుకుంటాడు.”

12యెహోవా చెప్పే మాట ఇదే:“గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు,దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా,సమరయలో మంచాల మీదపట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న,ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”

13“దీనిని విని, యాకోబు వారసులకు వ్యతిరేకంగా తెలియజేయండి” అని ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్తున్నారు.

14“ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజునబేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను;ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.

15చలికాలపు విడిది భవనాన్ని,ఎండకాలపు విడిది భవనాన్ని పడగొడతాను;ఏనుగు దంతంతో అలంకరించబడ్డ భవనాలు నాశనమవుతాయిగొప్ప భవనాలు నిర్మూలించబడతాయి,”అని యెహోవా చెప్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]