Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 5 OTSA

Show OTSA only
Verse × ×
1 "Call out now—is there anyone who will answer you? To which of the holy ones will you turn? “నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు? పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు?
2 For anger kills the fool, and jealousy slays the simple. ఆగ్రహం మూర్ఖులను చంపుతుంది. అసూయ బుద్ధిహీనులను చంపుతుంది.
3 I myself have seen a fool taking root, but suddenly I cursed his dwelling. మూర్ఖులు వేరుపాదుకోవడం నేను చూశాను, కాని హఠాత్తుగా వారి ఇల్లు శపించబడింది.
4 His children are far from safety; they are crushed in court, with no one to rescue them. వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది, వారి పక్షంగా వాదించేవారు లేక న్యాయస్థానంలో వారు నలిగిపోతారు.
5 The hungry eat his harvest, taking it even from among the thorns, and the thirsty pant after his wealth. ఆకలితో ఉన్నవారు వారి పంటను తినివేస్తారు, ముండ్ల మధ్యలో ఉన్నవాటిని కూడా వారు తీసుకుంటారు, దాహంతో ఉన్నవారు వారి ఆస్తి కోసం కాచుకుని ఉంటారు.
6 For affliction does not come from the dust, nor does trouble sprout from the ground. కష్టం దుమ్ములో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలకెత్తదు.
7 But man is born to trouble as surely as the sparks fly upward. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు బాధల కోసమే పుడుతున్నారు.
8 "As for me, I would seek God, and to God I would commit my cause. “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.
9 He does great things that cannot be fathomed, wonders without number. పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.
10 He gives rain on the face of the earth and sends water on the fields. ఆయన భూమిపై వాన కురిపిస్తారు; పొలాలకు నీటిని పంపిస్తారు.
11 He sets the lowly on high, and those who mourn are lifted to safety. ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు, దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు.
12 He frustrates the plans of the crafty, so that their hands achieve no success. వంచకుల చేతులు విజయం సాధించకుండ, ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు.
13 He catches the wise in their craftiness, and the schemes of the cunning are swept away. జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు, వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.
14 They meet darkness in the daytime and grope at noon as if it were night. పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది; రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు.
15 But he saves the needy from the sword of their mouth, and from the hand of the mighty. వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు; బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు.
16 So the poor have hope, and injustice shuts her mouth. కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది, అన్యాయం తన నోరు మూసుకుంటుంది.
17 "How blessed is the one whom God corrects; so do not despise the discipline of the Almighty. “దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.
18 For he wounds, but he binds up; he shatters, but his hands heal. గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.
19 From six troubles he will deliver you, and in seven no harm will touch you. ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.
20 In famine he will redeem you from death, and in war from the power of the sword. కరువు కాలంలో చావు నుండి, యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.
21 You will be hidden from the lash of the tongue, and you will not fear destruction when it comes. కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు, నాశనం వచ్చినా నీవు భయపడవు.
22 At destruction and famine you will laugh, and you will not fear the wild beasts of the earth. కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు, అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు.
23 For you will have a covenant with the stones of the field, and the wild beasts of the field will be at peace with you. ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.
24 You will know that your tent is secure; you will inspect your fold and find nothing missing. నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు; నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.
25 You will know that your children will be many, and your descendants like the grass of the earth. నీకు చాలామంది పిల్లలు ఉంటారని, నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.
26 You will come to your grave in ripe old age, like a sheaf gathered in its season. పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు.
27 "Yes, this we have searched out, and it is true. Hear it, and know it for yourself." “మేము ఇది పరిశీలించాము, ఇది నిజము. కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]