Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 4 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Eliphaz the Temanite answered: అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు:
2 "If someone ventures a word with you, will you grow weary? Yet who can hold back from speaking? ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా? కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?
3 Look, you have instructed many, and you have strengthened weak hands. ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో, ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు.
4 Your words have lifted up the one stumbling, and you have made firm the buckling knees. తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు.
5 But now it comes to you, and you are weary; it touches you, and you are dismayed. అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు.
6 Is not your fear of God your confidence, and the integrity of your ways your hope? నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?
7 Remember now: who, being innocent, ever perished? Where were the upright ever destroyed? “ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా?
8 As I have seen, those who plow wrongdoing and sow trouble reap the same. నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.
9 By the breath of God they perish, and by the blast of his anger they are consumed. దేవుని శ్వాసకు వారు నశిస్తారు; ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు.
10 The roar of the lion, the voice of the fierce lion, the teeth of the young lions—they are broken. సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.
11 The strong lion perishes for lack of prey, and the cubs of the lioness are scattered. సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి.
12 Now a word was brought to me in secret; my ear caught a whisper of it. “నాకొక విషయం రహస్యంగా తెలిసింది, నా చెవులు దాని గుసగుసను విన్నాయి.
13 Amid troubling thoughts from visions of the night, when deep sleep falls on people, ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,
14 dread came upon me, and trembling, and it made all my bones shake. భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.
15 A spirit glided past my face; the hair on my body stood on end. ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
16 It stood still, but I could not make out its shape. A form was before my eyes; there was silence, then I heard a voice: అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.
17 'Can a mortal be righteous before God? Can a man be pure before his Maker? ‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?
18 Look, he puts no trust in his servants, and he charges his angels with error; దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,
19 how much more those who dwell in houses of clay, whose foundation is in the dust, who are crushed like a moth. మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!
20 Between morning and evening they are shattered; unnoticed, they perish forever. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.
21 Is not their tent-cord pulled up within them? They die without ever gaining wisdom.'" వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]