Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 40 OTSA

Show OTSA only
Verse × ×
1 Then our Father said to Job: యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:
2 "Will the one who disputes with the Almighty correct him? Let my accuser answer it." “సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”
3 Then Job answered our Father: అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:
4 "See, I am unworthy—how can I answer you? I put my hand over my mouth. “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.
5 I have spoken once—I will not reply; twice—I will say no more." ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”
6 Then our Father answered Job out of the storm: అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
7 "Brace yourself like a man; I will question you, and you will answer me. “పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.
8 Would you really annul my justice? Would you condemn me so that you may be right? “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?
9 Do you have an arm like mine? Can you thunder with a voice like mine? దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?
10 Adorn yourself with majesty and dignity; clothe yourself with honor and splendor. అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! ఘనత ప్రభావాలను ధరించుకో!
11 Pour out the fury of your anger; look on everyone who is proud and bring him low. నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,
12 Look on everyone who is proud and humble him; crush the wicked where they stand. గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు.
13 Bury them all in the dust together; shroud their faces in the grave. వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; వారిని సమాధిలో బంధించు.
14 Then even I would praise you, for your own right hand could save you. అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.
15 Look at Behemoth, which I made just as I made you; he eats grass like an ox. “నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.
16 Look—his strength is in his loins, and his power in the muscles of his belly. దాని బలం దాని నడుములో ఉంది, దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది!
17 He stiffens his tail like a cedar; the tendons of his thighs are tightly knit together. దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి.
18 His bones are tubes of bronze, his limbs like bars of iron. దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి.
19 He is the first of my works; only his Maker can approach him with the sword. దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.
20 The mountains yield their produce for him, where all the wild animals play. కొండలు దానికి ఆహారం అందిస్తాయి, అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి.
21 Under the lotus plants he lies down, in the cover of the reeds and the marsh. తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది.
22 The lotus plants cover him with their shade; the willows of the brook surround him. తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి.
23 If the river rages, he is not alarmed; he is confident though the Jordan surges against his mouth. నది పొంగిపొర్లినా అది భయపడదు. యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది.
24 Can anyone capture him while he watches, or pierce his nose with a snare?" అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా?
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]