Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 39 OTSA

Show OTSA only
Verse × ×
1 "Do you know when the mountain goats give birth? Do you watch over the does when they give birth? “కొండమీద తిరిగే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? లేళ్లు పిల్లలను కంటున్నప్పుడు నీవు చూశావా?
2 Can you count the months they carry their young? Do you know the time they give birth? అవి ఎన్ని నెలల వరకు మోస్తాయో నీవు లెక్కపెడతావా? అవి పిల్లలను కనే సమయం నీకు తెలుసా?
3 They crouch down and give birth; their birth pangs are over. అవి వంగి తమ పిల్లలకు జన్మనిస్తాయి; వాటి పురుటినొప్పులు అంతలోనే ఆగిపోతాయి.
4 Their young grow strong in the open field; they leave and do not return. వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి. అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు.
5 "Who set the wild donkey free? Who untied the ropes of the swift donkey, “అడవి గాడిదను స్వేచ్ఛగా వెళ్లనిచ్చేది ఎవరు? దాని కట్లను విప్పింది ఎవరు?
6 to whom I gave the wilderness for a home and the salt flats for a dwelling place? బంజరు భూమిని దానికి ఇల్లుగా ఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను.
7 He scorns the noise of the city and never hears a driver's shout. అది పట్టణంలోని సందడిని చూసి నవ్వుతుంది; తోలేవాని కేకలు అది వినదు.
8 He ranges the mountains for his pasture, searching for every green thing. దాని పచ్చిక కోసం అది పర్వతాల్లో తిరుగుతుంది, ఏదైన పచ్చని దాని కోసం వెదకుతుంది.
9 "Is the wild ox willing to serve you? Will he spend the night beside your feeding trough? “నీకు సేవ చేయడానికి అడవి ఎద్దు అంగీకరిస్తుందా? రాత్రివేళ అది నీ పశువుల దొడ్డిలో ఉంటుందా?
10 Can you bind the wild ox to the furrow with ropes? Will he plow the valleys behind you? నీవు అడవి ఎద్దుకు పగ్గం వేసి నాగటికి కట్టి నడిపించగలవా? నీ వెనుక నడుస్తూ అది లోయ భూములను దున్ని చదును చేస్తుందా?
11 Will you rely on him because his strength is great? Will you trust your labor to him? దాని బలం గొప్పదని దాన్ని నమ్ముతావా? నీ పెద్ద పనిని దానికి అప్పగిస్తావా?
12 Can you trust him to bring back your grain and gather it to your threshing floor? అది నీ ధాన్యాన్ని ఇంటికి మోసుకొనివచ్చి, అది నీ నూర్పిడి కళ్ళంలో కూర్చుతుందని నీవు నమ్మగలవా?
13 "The wings of the ostrich flap joyfully, but are they the feathers and plumage of a stork? “నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది, అయినా కొంగకున్న రెక్కలు ఈకలతో అవి పోల్చబడకపోయినా.
14 She leaves her eggs on the ground and lets them warm in the dust, అది నేలమీద గుడ్లు పెడుతుంది ఇసుకలో వాటిని పొదుగుతుంది.
15 forgetting that a foot may crush them, or a wild animal may trample them. ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని, ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు.
16 She treats her young harshly, as if they were not her own; she has no fear that her labor was in vain, తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది; తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.
17 because I made her forget wisdom and gave her no share in understanding. ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.
18 Yet when she takes off running, she laughs at the horse and its rider. అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.
19 "Do you give the horse his strength? Do you clothe his neck with a flowing mane? “గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా? దాని మెడ మీద జూలు పెట్టింది నీవా?
20 Do you make him leap like a locust? His proud snorting strikes terror. దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా, మీరు దానిని దూకేలా చేస్తారా?
21 He paws in the valley and rejoices in his strength; he charges into battle. అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి, పోరాడటానికి పరుగెడుతుంది.
22 He laughs at fear and is not terrified; he does not shrink back from the sword. అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు; ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు.
23 The quiver rattles against him, the flashing spear and the javelin. మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటు దాని అంబులపొది గలగలలాడుతుంది,
24 With fierce, raging excitement he devours the ground; he cannot stand still when the trumpet sounds. పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది; బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు.
25 At the blast of the trumpet he says, 'Aha!' He catches the scent of battle from afar, the thunder of the commanders and the war cry. బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది దూరం నుండే యుద్ధవాసన, సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.
26 "Is it by your understanding that the hawk takes flight and spreads his wings toward the south? “దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?
27 Is it at your command that the eagle soars and builds his nest on high? నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి, తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?
28 He lives on the cliff and makes his home there, on the rocky crag, his stronghold. ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.
29 From there he searches out his food; his eyes spot it from far away. అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది; దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి.
30 His young ones feast on blood, and wherever the slain are, there he is." దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి, మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]