Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 41 OTSA

Show OTSA only
Verse × ×
1 "Can you draw out Leviathan with a fishhook, or press down his tongue with a cord? “లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?
2 Can you put a rope in his nose, or pierce his jaw with a hook? దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా? దవడకు గాలం ఎక్కించగలవా?
3 Will he make many pleas to you? Will he speak soft words to you? దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా? మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా?
4 Will he make a covenant with you, that you should take him as your servant forever? జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?
5 Will you play with him like a bird, or put him on a leash for your girls? ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?
6 Will traders bargain over him? Will they divide him up among the merchants? వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా? వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా?
7 Can you fill his hide with harpoons, or his head with fishing spears? దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా?
8 Lay your hand on him; remember the battle—you will not do it again. నీవు దాని మీద చేయి వేసి చూడు, దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు.
9 Any hope of subduing him is false; the mere sight of him will lay you low. దానిని వశపరుచుకోవాలనే ఆశ అబద్ధం; కేవలం దానిని చూస్తే చాలు ఎవరైనా భయపడిపోతారు.
10 No one is fierce enough to rouse him. Who then is able to stand before me? దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?
11 Who has confronted me, that I must repay him? Everything under the whole heaven is mine. నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు? ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే.
12 "I will not keep silent about his limbs, his mighty strength, or his graceful frame. “లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి, దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను.
13 Who can strip off his outer covering, or come at him with a double bridle? దానిపై కవచాన్ని ఎవరు లాగివేయగలరు? దాని రెండంతల కవచంలోకి ఎవరు చొచ్చుకోగలరు?
14 Who can open the doors of his face? His ringed teeth are surrounded by terror. భయంకరమైన పళ్ళ వరుస గల, దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు?
15 His back is rows of shields, shut up tightly as with a seal. దాని వీపుమీది పొలుసులు చాలా గట్టివి; అవి దగ్గరగా బిగుసుగా కూర్చబడ్డాయి.
16 One is so near to another that no air can pass between them. గాలికూడా వాటి మధ్యలోనికి చొరబడలేనంత ప్రతిదీ దాని తర్వాత దానికి చాలా దగ్గరగా ఉంటుంది.
17 They are joined one to another; they clasp each other and cannot be parted. ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి, అవి అంటిపెట్టుకుని ఉంటాయి వాటిని ఎవరు వేరు చేయలేరు.
18 His sneezes flash with light, and his eyes are like the eyelids of the dawn. దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది; దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి.
19 Out of his mouth go flaming torches; sparks of fire leap out. దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి; నిప్పు కణాలు ఎగిరివస్తాయి.
20 Out of his nostrils comes smoke, as from a boiling pot over burning reeds. జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది.
21 His breath sets coals ablaze, and a flame leaps from his mouth. దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది, దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి.
22 Strength dwells in his neck, and terror dances before him. బలం దాని మెడలో ఉంటుంది; నిరాశ దాని ముందర నడుస్తుంది.
23 The folds of his flesh stick together, firmly cast upon him and immovable. దాని మాంసం యొక్క మడతలు దగ్గరగా కలుపబడ్డాయి; అవి దృఢంగా అంటుకుని ఉంటాయి.
24 His heart is hard as stone, hard as the lower millstone. దాని రొమ్ము బండలా గట్టిగా, తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది.
25 When he rises up, the mighty are afraid; at the crashing they are beside themselves. అది లేచినప్పుడు, బలవంతులు భయపడతారు; అది కొట్టకుండానే పారిపోతారు.
26 Though a sword reaches him, it does not hold, nor does the spear, the dart, or the javelin. ఖడ్గంతో దాడి చేసినా ప్రభావం ఉండదు, ఈటెలు బాణాలు బరిసెలు దాని మీద పని చేయవు.
27 He counts iron as straw, and bronze as rotten wood. దానికి ఇనుము అంటే తుక్కుతో ఇత్తడి అంటే పుచ్చిపోయిన చెక్కతో సమానము.
28 The arrow cannot make him flee; for him, sling stones turn to stubble. బాణాలు దానిని పారిపోయేలా చేయలేవు; వడిసెల రాళ్లు దానికి పొట్టుతో సమానము.
29 Clubs are counted as stubble; he laughs at the rattle of the javelin. దుడ్డుకర్ర దానికి తుక్కు ముక్కలా ఉంటుంది; వడిగా వెళ్తున్న ఈటెను చూసి నవ్వుతుంది.
30 His underside is like sharp pottery shards; he spreads out like a threshing sledge on the mire. దాని దిగువ భాగం పగిలిన కుండపెంకుల వలె గరుకుగా ఉంటాయి, బురద మీద నూర్పిడి కర్రను పోలిన గుర్తులను ఏర్పరుస్తుంది.
31 He makes the deep boil like a pot; he stirs the sea like a churning kettle of ointment. అది దాని గందరగోళంతో నీటిని మరిగేలా చేస్తుంది. అది సముద్రాన్ని కదిలించి నూనె మరుగుతున్న కుండలా చేస్తుంది.
32 Behind him he leaves a shining wake; one would think the deep had grown white hair. అది వెళ్లిన దారంతా మెరుస్తున్న నురుగును వదలుతుంది; అది చూసేవారికి సముద్రానికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేమో అనిపిస్తుంది.
33 On earth there is nothing like him, a creature made without fear. భూమి మీద దానికి సమానమైనదేదీ లేదు; ఒక భయంలేని సృష్టి.
34 He looks down on all that is lofty; he is king over all the proud." అహంకారం కలిగిన వాటన్నిటిని చిన్న చూపు చూస్తుంది; గర్వపడే వాటన్నిటికి అది రాజు.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]