Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 35 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Elihu continued and said: ఇంకా ఎలీహు అన్నాడు:
2 "Do you think this is just? You say, 'My righteousness is more than God's.' “ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’
3 For you ask, 'What good does it do you? What do I gain by not sinning?' అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి? ‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’ అని నీవు అడుగుతున్నావు.
4 I will answer you, and your friends along with you. “నేను నీ స్నేహితులకు నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.
5 Look up at the heavens and see; gaze at the clouds, which are higher than you. ఆకాశం వైపు తేరి చూడండి; మీకన్నా ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాల వైపు చూడండి.
6 If you sin, what do you accomplish against him? And if your rebellions are many, what do you do to him? నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది? నీ పాపాలు ఎక్కువగా ఉంటే, అది ఆయనకేమి చేస్తుంది?
7 If you are righteous, what do you give him? Or what does he receive from your hand? నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు, నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు?
8 Your wickedness affects only a man like yourself, and your righteousness only a fellow human. నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద, నీ నీతి ఇతరుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది.
9 People cry out under the weight of many oppressions; they call for help against the arm of the mighty. “ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు; బలవంతుల చేతి నుండి విడుదల కోసం విన్నవించుకొంటారు.
10 But no one says, 'Where is God my Maker, who gives songs in the night, అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బోధించే, ఆకాశపక్షుల కన్నా మనలను జ్ఞానవంతులుగా చేసే, నా సృష్టికర్తయైన దేవుడు ఎక్కడున్నాడు?’ అని ఎవరు అనరు.
11 who teaches us more than the beasts of the earth and makes us wiser than the birds of the sky?' Not in this edition
12 There they cry out, but he gives no answer, because of the pride of evil men. దుర్మార్గుల గర్వం కారణంగా ప్రజలు మొరపెట్టినా ఆయన జవాబివ్వరు.
13 Surely God does not listen to an empty cry; the Almighty pays it no attention. నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు; సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు.
14 How much less, then, will he answer when you say you do not see him—though your case is before him and you must wait for him. అయితే, మీరు అతన్ని చూడలేదని, మీ వాదన అతని ముందు ఉందని, మీరు అతని కోసం వేచి ఉండాలని,
15 And now, because his anger has not yet punished, and he has taken little notice of foolishness. ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూ శిక్షించదు అతడు దుర్మార్గాన్ని కనీసం పట్టించుకోడు.
16 Job opens his mouth with empty talk; he multiplies words without knowledge." కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు; తెలివి లేకుండా ఎన్నో మాటలు పలికాడు.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]