Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ezekiel 19 OTSA

Side by side with the Father's Heart Bible™

ఇశ్రాయేలు అధిపతుల గురించి విలాప గీతం

1“నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు:

2“ ‘నీ తల్లి ఎలాంటిది అంటేసింహాల మధ్యలో ఆడసింహం లాంటిది.కొదమ సింహాల మధ్య పడుకునితన పిల్లలను పెంచింది.

3ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడుఅది బలమైన సింహం అయ్యింది.అది వేటాడడం నేర్చుకొనిమనుష్యులను తినే జంతువుగా మారింది.

4దాని గురించి ఇతర జనాంగాలు వినితమ గోతిలో దానిని పట్టుకున్నారు.దానికి గాలం తగిలించిఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు.

5“ ‘అది చూసిన దాని తల్లితన ఆశ నిరాశ అయ్యిందనితన పిల్లల్లో మరో దానిని తీసుకునిబలమైన సింహంగా తయారుచేసింది.

6ఇది కూడా కొదమ సింహమై,మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూవేటాడడం నేర్చుకొనిమనుష్యులను తినే జంతువుగా మారింది.

7అది వారి బలమైన కోటలను పడగొట్టివారి పట్టణాలను పాడుచేసింది.దాని గర్జన వినిదేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.

8నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూదానిని పట్టుకోవడానికి వచ్చిదాని కోసం తమ వలలు పన్నితమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.

9దానికి గాలం తగిలించి బోనులో పెట్టిబబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు.ఇశ్రాయేలీయుల పర్వతాలమీదదాని గర్జన ఎన్నటికీ వినబడకుండావారు దానిని చెరసాలలో ఉంచారు.

10“ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కననాటబడిన ద్రాక్షవల్లిలాంటిది;నీరు సమృద్ధిగా ఉన్నందునఅది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.

11పాలకుల రాజదండాన్ని చేయడానికి తగినబలమైన కొమ్మలు దానికున్నాయి.అది మేఘాలను తాకే అంతగాపైకి పెరిగిందిదానికున్న అనేక కొమ్మలతోఏపుగా పెరిగింది.

12అయితే మహా కోపంతో అది పెరికి వేయబడినేల మీద పారవేయబడింది.తూర్పు గాలి వీచగాదాని పండ్లు వాడిపోయాయి;బలమైన దాని కొమ్మలుఅగ్నిలో పడి కాలిపోయాయి.

13ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిననీళ్లు లేని ఎడారిలో నాటబడింది.

14దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించిదాని పండ్లను కాల్చివేసింది.పాలకుల రాజదండాన్ని చేయడానికి తగినబలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]