Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 8 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Bildad the Shuhite answered: అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు:
2 "How long will you go on speaking such things? The words of your mouth are nothing but a roaring wind. “ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి.
3 Does God pervert justice? Does the Almighty pervert what is right? దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా? సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా?
4 If your children sinned against him, he handed them over to the consequence of their rebellion. నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు, అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు.
5 But if you will earnestly seek God and plead with the Almighty for mercy, కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,
6 if you are pure and upright, surely now he will rouse himself for you and restore you to your rightful place. నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.
7 Though your beginning was small, your later years will flourish beyond measure. నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది.
8 Ask the generations long past, and consider what their fathers searched out. “గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు,
9 For we were born just yesterday and know nothing; our days on earth are but a shadow. ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, భూమిపై మన రోజులు నీడ వంటివి.
10 Will they not teach you and tell you, and bring forth words from their understanding? వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా?
11 Can papyrus grow tall where there is no marsh? Can reeds flourish without water? బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా?
12 While still green and uncut, it withers faster than any grass. అవి కోయకముందు పచ్చగా ఉంటాయి గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి.
13 Such is the destiny of all who forget God; so perishes the hope of the godless. దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది.
14 His confidence is fragile, and his trust is a spider's web. వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది.
15 He leans on his house, but it does not stand; he holds fast to it, but it does not endure. వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు, వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది.
16 He is like a well-watered plant in the sunshine, spreading its shoots over the garden. వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ, వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు.
17 Its roots wrap around a heap of stones and search among the rocks for a place to grip. దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని, రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది.
18 But when he is torn from his place, it disowns him, saying, 'I never saw you.' ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు, ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది.
19 Such is the joy of his way—and from the soil others spring up in his place. ఖచ్చితంగా అది వాడిపోతుంది, భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
20 God will not reject a blameless man, nor will he lend a hand to evildoers. “దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు.
21 He will yet fill your mouth with laughter and your lips with shouts of joy. ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు.
22 Those who hate you will be clothed with shame, and the tent of the wicked will be no more." నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]