Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 9 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Job answered: అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2 "Truly I know that this is so. But how can a mortal be righteous before God? “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు. అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు?
3 If one wished to contend with him, he could not answer him once in 1,000 times. వారు ఆయనతో వాదించాలనుకుంటే, వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు.
4 He is wise in heart and mighty in strength—who has ever defied him and come through unharmed? ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు. ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు?
5 He removes mountains before they know it, overturning them in his anger. ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు, కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు.
6 He shakes the earth out of its place, and its pillars tremble. ఆయన భూమిని దాని స్థలంలో నుండి కదిలించి దాని స్తంభాలు అదిరేలా చేస్తారు.
7 He commands the sun, and it does not rise; he seals up the stars. ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.
8 He alone stretched out the heavens and tramples the waves of the sea. ఆయనే ఆకాశాన్ని విశాలపరుస్తారు సముద్రపు అలలను అణచివేస్తారు.
9 He made the Bear, Orion, and the Pleiades, and the constellations of the southern sky. స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు.
10 He does great things beyond fathoming, marvelous things beyond number. ఆయన ఎవరు గ్రహించలేని మహాకార్యాలను లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తారు.
11 Look—he passes by me, and I do not see him; he moves on, but I do not perceive him. ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను, ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను.
12 If he snatches away, who can turn him back? Who will say to him, 'What are you doing?' ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు? ‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు?
13 God will not turn back his anger; beneath him the helpers of the sea monster Rahab lay crushed. దేవుడు తన కోపాన్ని అణచుకోరు; రాహాబు సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు.
14 How much less can I answer him, or choose my words to argue with him? “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?
15 Though I were in the right, I could not answer him; I could only plead with my judge for mercy. నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను.
16 If I called and he answered me, I would not believe that he was listening to my voice. నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.
17 For he crushes me with a storm and multiplies my wounds without cause. తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.
18 He will not let me catch my breath, but fills me with bitterness. ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.
19 If it is a matter of strength, he is the mighty one! And if it is a matter of justice, who can summon him to court? బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?
20 Though I were in the right, my own mouth would condemn me; though I were blameless, it would prove me perverse. నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది; నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.
21 I am blameless; I no longer care about myself; I despise my own life. “నేను నిర్దోషినినైనా నా గురించి నాకు శ్రద్ధ లేదు. నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను.
22 It is all the same; therefore I say, he destroys both the blameless and the wicked. ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను, దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను.
23 When sudden disaster brings death, he mocks the despair of the innocent. ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే, నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.
24 The earth is handed over to the wicked; he blindfolds its judges. If it is not he, then who? భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు, ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు. ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు?
25 My days are swifter than a runner; they flee away, they see no good. “పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.
26 They skim past like boats of reed, like an eagle swooping down on its prey. రెల్లు పడవలు దాటిపోతున్నట్లు, గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.
27 If I say, 'I will forget my complaint, I will put aside my gloomy face and be cheerful,' నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,
28 I dread all my pains, for I know you will not declare me innocent. నా బాధలన్నిటికి భయపడతాను ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.
29 I will be condemned; why then should I labor in vain? నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?
30 If I washed myself with snow and cleansed my hands with lye, సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,
31 yet you would plunge me into the pit, and my own clothes would loathe me. మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
32 For he is not a man like me, that I could answer him, that we could go to court together. “నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి దేవుడు నాలాంటి మనిషి కాదు.
33 There is no mediator between us, who could lay his hand on us both. మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, మమ్మల్ని కలపగల వారు మాకు లేరు,
34 Let him take his rod away from me, and let the dread of him no longer terrify me. దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.
35 Then I would speak without fearing him; but as it is, I am not free to do so." అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]