Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 14 OTSA

Side by side with the Father's Heart Bible™

1“స్త్రీకి పుట్టిన మనుష్యులు,ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు.

2వారు పువ్వులా వికసించి వాడిపోతారు;నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు.

3అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా?తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా?

4అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు?ఎవరు తీసుకురాలేరు!

5మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి;వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారువారు దాటలేని పరిధిని మీరు నియమించారు.

6కూలివారిలా వారు తమ పని ముగించే వరకుమీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి.

7“కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది:దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది,దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.

8దాని వేర్లు భూమిలో ఎండిపోయినాదాని మోడు మట్టిలో చనిపోయినా,

9నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది.లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.

10కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు;చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు.

11సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా,నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా,

12మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు;ఆకాశం గతించేవరకు వారు మేలుకోరువారి నిద్ర నుండి తిరిగి లేవరు.

13“మీరు నన్ను సమాధిలో దాచిపెడితే,మీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను దాచి ఉంచితే ఎంత బాగుండేది!మీరు నాకు కొంతకాలం నియమించిఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది!

14ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా?అలా అయితే నేను కష్టపడి పనిచేసే రోజులన్నీనా విడుదల కోసం నేను ఎదురుచూస్తాను.

15అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను;మీ చేతులు చేసిన వాటిని మీరు ఇష్టపడతారు.

16అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారుకాని నా పాపాలను గుర్తించరు.

17నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి;మీరు నా పాపాన్ని కప్పివేస్తారు.

18“పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగాకొండలు వాటి స్థానం తప్పునట్లుగా,

19నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగాప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు,మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు.

20మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు;మీరు వారి ముఖం తీరు మార్చివేసి వారిని వెళ్లగొడతారు.

21ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు;వారి సంతానం అణచివేయబడినా వారు గ్రహించలేరు.

22వారు తమ శరీరంలోని బాధను మాత్రమే అనుభవిస్తారుతమ కోసం మాత్రమే దుఃఖపడతారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]