Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ecclesiastes 4 OTSA

Show OTSA only
Verse × ×
1 Again I looked and saw all the oppression under the sun: the oppressed were in tears, with no one to comfort them; their oppressors held the power, and still no comforter. సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.
2 So I declared the dead, who had already died, happier than the living, who are still alive. ఇంకా జీవించి ఉన్నవారి కంటే మునుపే చనిపోయినవారు, సంతోషంగా ఉన్నారని నేను అనుకున్నాను.
3 Better than both is the one not yet born, who hasn't seen the evil done under the sun. ఇంకా పుట్టనివారు, సూర్యుని క్రింద జరిగే చెడును చూడనివారు, ఈ ఇరువురి కన్నా ధన్యులు.
4 I saw all labor and skill come from one neighbor's envy of another. This too is fleeting, a chasing after wind. కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే.
5 The fool folds his hands and ruins himself. మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు.
6 Better one handful with tranquility than two handfuls with toil and a chasing after the wind. రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు.
7 Again I saw something fleeting under the sun: నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను:
8 A man alone, no companion, no son or brother; his labor has no end, yet his eyes never fill with wealth. "For whom am I working," he asks, "denying myself good?" This too is a breath—a bad task. ఒక ఒంటరివాడు ఉండేవాడు; అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, ఇది కూడా అర్థరహితమే విచారకరమైన క్రియ!
9 Two are better than one, because they have a good return for their labor: ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది:
10 If one falls, the other lifts him up. But pity the one who falls alone, with no one to help him up. ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు.
11 Also, if two lie down together, they will keep warm. But how can one keep warm alone? అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?
12 One alone can be overpowered; two can resist. A cord of three strands is not quickly broken. ఒంటరి వారిని పడద్రోయడం తేలిక, ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.
13 Better a poor, wise youth than an old, foolish king who no longer knows to take warning. మూర్ఖుడై హెచ్చరికలు వినడానికి ఇష్టపడని ముసలి రాజుకంటే బీదవాడైన జ్ఞానంగల యువకుడే నయము.
14 The youth may have come from prison to reign, or he may have been born poor within that same kingdom. అలాంటి యువకుడు చెరసాలలో నుండి బయటపడి పట్టాభిషేకం పొందవచ్చు. తన దేశంలో దరిద్రుడిగా పుట్టినా రాజు కాగలడు.
15 I saw all the living who move about under the sun following the youth, the king's successor. సూర్యుని క్రింద జీవిస్తూ తిరిగే వారందరూ రాజు బదులు రాజైన ఆ యువకుని అనుసరిస్తారని నేను తెలుసుకున్నాను.
16 Countless were all the people who came before him. Yet those who came later were not pleased with him. This too is fleeting, a chasing after wind. అతని అధికారం క్రింద ఉన్న ప్రజలు అసంఖ్యాకులు. కానీ తర్వాత వచ్చినవారు అతని పట్ల సంతోషించరు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]