Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ecclesiastes 3 OTSA

Show OTSA only
Verse × ×
1 For everything there is a season, and a time for every matter under heaven: ప్రతిదానికీ ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:
2 a time to be born, and a time to die; a time to plant, and a time to uproot what is planted; పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం,
3 a time to kill, and a time to heal; a time to tear down, and a time to build up; చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి.
4 a time to weep, and a time to laugh; a time to mourn, and a time to dance; ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి,
5 a time to throw away stones, and a time to gather stones together; a time to embrace, and a time to refrain from embracing; రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.
6 a time to seek, and a time to lose; a time to keep, and a time to throw away; వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి,
7 a time to tear, and a time to sew; a time to be silent, and a time to speak; చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,
8 a time to love, and a time to hate; a time for war, and a time for peace. ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.
9 What gain has the worker from his toil? కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి?
10 I have seen the task that God has given people to keep them busy. మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.
11 He made everything beautiful in its time, and set eternity in the human heart—yet no one can grasp what God has done from start to end. ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు.
12 I know nothing is better for them than to enjoy life and do good while they live. మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను.
13 Also, that everyone eat, drink, and find satisfaction in all their work—this is God's gift. ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను.
14 I know all God does lasts forever; nothing can be added, nothing removed. He has done it so people will fear before him. దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు.
15 What is has already been, and what will be has already been; and God seeks out what was driven away. ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే. ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే. మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు.
16 I also saw under the sun: evil in the place of judgment, and evil in the place of righteousness. సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను. న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది.
17 I said in my heart: "God will judge the righteous and the wicked, for there's a time for every matter and every deed, there." నేనిలా అనుకున్నాను, “నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తారు, ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.”
18 I said in my heart: "God tests people, so that they may see they're just animals." నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు.
19 Humans and animals share one fate: one dies as the other dies; both have the same breath. Humans have no advantage over animals—all is vapor. ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే.
20 All go to one place; all came from the dust, and all return to the dust. అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది.
21 Who knows whether the human spirit goes up, and whether the animal's spirit goes down to the earth? ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”
22 So I saw nothing is better than a person rejoicing in their work, since that is their lot. For who can show them what comes after them? కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు?
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]