Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Amos 4 IRVTel

Side by side with the Father's Heart Bible™

దేవునివైపు తిరగలేని ఇశ్రాయేలు

1సమరయ పర్వతం మీద ఉన్నబాషాను ఆవులారా, పేదలను అణిచేస్తూదిక్కులేని వాళ్ళని బాధిస్తూ,మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా”అనే మీరు, ఈ మాట వినండి.

2యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే,“మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది.మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు.

3మీరంతా ప్రాకారాల్లో పగుళ్ళగుండా దూరి వెళ్లిపోతారు.మిమ్మల్ని హెర్మోను పర్వతం బయట పారవేస్తారు.”యెహోవా ప్రకటించేది ఇదే.

4బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి.గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువగా తిరుగుబాటు చేయండి.ప్రతి ఉదయం బలులు తీసుకు రండి.మూడు రోజులకు ఒకసారి మీ పదో భాగాలు తీసుకురండి.

5రొట్టెతో కృతజ్ఞత అర్పణ అర్పించండి.స్వేచ్ఛార్పణలు ప్రకటించండి.వాటి గురించి చాటించండి.ఇశ్రాయేలీయులారా, ఇలా చేయడం మీకిష్టం గదా.యెహోవా ప్రకటించేది ఇదే.

6మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను.మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను.అయినా మీరు నా వైపు తిరుగలేదు.యెహోవా ప్రకటించేది ఇదే.

7కోతకాలానికి మూడు నెలలు ముందేవానలేకుండా చేశాను.ఒక పట్టణం మీద వాన కురిపించిమరొక పట్టణం మీద కురిపించలేదు.ఒక చోట వాన పడింది,వాన పడని పొలం ఎండిపోయింది.

8రెండు మూడు ఊర్లుమంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతేఅక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు.అయినా మీరు నా వైపు తిరగలేదు.యెహోవా ప్రకటించేది ఇదే.

9విస్తారమైన మీ తోటలన్నిటినీతెగుళ్ళతో నేను పాడు చేశాను.మీ ద్రాక్షతోటలనూఅంజూరపు చెట్లనీఒలీవచెట్లనూమిడతలు తినేశాయి.అయినా మీరు నావైపు తిరగలేదు.యెహోవా ప్రకటించేది ఇదే.

10నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టుమీ మీదికి తెగుళ్లు పంపాను.మీ యువకులను కత్తితో చంపేశాను.మీ గుర్రాలను తీసుకుపోయారు.మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసనమీ ముక్కుల్లోకి ఎక్కింది.అయినా మీరు నా వైపు తిరగలేదు.యెహోవా ప్రకటించేది ఇదే.

11దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టునేను మీలో కొంతమందిని నాశనం చేశాను.మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు.అయినా మీరు నా వైపు తిరగలేదు.యెహోవా ప్రకటించేది ఇదే.

12కాబట్టి ఇశ్రాయేలీయులారా,మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను.కాబట్టి ఇశ్రాయేలీయులారా,మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి.

13పర్వతాలను రూపించే వాడూగాలిని పుట్టించేవాడూ ఆయనే.ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు.ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు.భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు.ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]