Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Zephaniah 3 OTSA

Side by side with the Father's Heart Bible™

యెరూషలేము

1అణచివేత, తిరుగుబాటుతనం,అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ!

2ఆమె ఎవరికీ లోబడదు,ఆమె దిద్దుబాటును అంగీకరించదు.ఆమె యెహోవా మీద నమ్మకముంచదు,ఆమె తన దేవున్ని సమీపించదు.

3దానిలో ఉన్న అధికారులుగర్జించే సింహాలు;దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ,ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.

4దాని ప్రవక్తలు నీతిలేనివారు;వారు నమ్మకద్రోహులు.దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారుధర్మశాస్త్రాన్ని హింసిస్తారు.

5అయితే యెహోవా నీతిమంతుడు;ఆయన తప్పు చేయరు.అనుదినం ఆయన మానకుండా,ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు,అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.

పశ్చాత్తాపపడని యెరూషలేము

6“నేను దేశాలను నాశనం చేశాను;వాటి కోటలు పడగొట్టబడ్డాయి.నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను,ఎవరూ వాటి గుండా వెళ్లరు.వాటిలో ఎవరూ నివసించకుండావారి పట్టణాలను నిర్జనంగా చేశాను.

7నేను యెరూషలేము గురించి,‘ఖచ్చితంగా నీవు నాకు భయపడిదిద్దుబాటును అంగీకరిస్తావు!అప్పుడు దాని ఆశ్రయ స్థలం నాశనం చేయబడదు,నా శిక్షలేవీ దాని మీదికి రావు’ అని అనుకున్నాను.కాని వారు అన్ని రకాలచెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.

8కాబట్టి నా కోసం వేచి ఉండండి,”అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు.“నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి.నేను దేశాలను పోగుచేయాలని,రాజ్యాలను సమకూర్చాలనివాటి మీద నా ఉగ్రతనునా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను.రోషంతో కూడిన నా కోపానికిలోకమంతా దహించబడుతుంది.

మిగిలి ఉన్న ఇశ్రాయేలును పునరుద్ధరించుట

9“నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను,అప్పుడు వారంతా యెహోవా నామానికి మొరపెట్టిఏక మనసుతో ఆయనను సేవిస్తారు.

10చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలుకూషు నదుల అవతల నుండినాకు అర్పణలు తెస్తారు.

11ఆ దినాన యెరూషలేమా,నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు,ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారినినేను నీలో నుండి తొలగిస్తాను.నా పరిశుద్ధ కొండపైఇంకెప్పుడు నీవు గర్వపడవు.

12అయితే నేను మీలోసాత్వికులను, దీనులను వదిలివేస్తాను.ఇశ్రాయేలులో మిగిలినవారుయెహోవా నామాన్ని నమ్ముతారు.

13ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు;వారు అబద్ధాలు చెప్పరు.మోసపూరిత నాలుకవారి నోళ్లలో ఉండదు.వారు తిని పడుకుంటారువారికి ఎవరి భయం ఉండదు.”

14సీయోను కుమారీ, పాట పాడు;ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి!యెరూషలేము కుమారీ,నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు!

15యెహోవా నీ శిక్షను తొలగించారు,నీ శత్రువును తిప్పికొట్టారు.ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు;ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.

16ఆ రోజునవారు యెరూషలేముతో,“సీయోనూ, భయపడకు;నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.

17నీ దేవుడైన యెహోవా,రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు.ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు;ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు,పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”

18“నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీనేను మీ మధ్య నుండి తొలగిస్తాను.వారు మీకు భారంగా నిందగా ఉన్నారు.

19ఆ సమయంలోనిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను.కుంటివారిని నేను రక్షిస్తాను;చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను.వారు అవమానానికి గురైన ప్రతి దేశంలోనేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను.

20ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను;ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను.నేను మిమ్మల్నిచెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడుభూమ్మీద ఉన్న ప్రజలందరిలోనేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను”అని యెహోవా అంటున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]