Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 22 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Eliphaz the Temanite answered: అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
2 "Can a man be of any benefit to God? Surely the wise man benefits only himself. “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?
3 Is it any pleasure to the Almighty if you are righteous, or any gain to him if you live blamelessly? నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?
4 Is it for your reverence that he rebukes you and brings you to judgment? “నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా? దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా?
5 Is not your wickedness great? Are not your sins endless? నీ దుష్టత్వం గొప్పది కాదా? నీ పాపాలు అంతులేనివి కావా?
6 For you demanded collateral from your brothers for no reason and stripped the clothing from the naked. ఏ కారణం లేకుండానే నీ సోదరుల దగ్గర తాకట్టు తీసుకున్నావు; నీవు ప్రజల బట్టలు లాక్కుని, వారిని నగ్నంగా వదిలివేసావు.
7 You gave no water to the weary to drink, and you withheld bread from the hungry. సొంత భూమి కలిగి ఉండి, నీవు అధికారంలో ఉండి, ఒక గౌరవం కలిగినవాడవై, స్థాయికి తగినట్టుగా జీవిస్తూ కూడా, నీవు అలసిపోయినవారికి నీళ్లు ఇవ్వలేదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండ వెనుకకు తీసుకున్నావు.
8 The man of power owned the land, and the favored one lived in it. Not in this edition
9 You sent widows away empty-handed and crushed the arms of orphans. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు తండ్రిలేనివారి బలాన్ని అణగద్రొక్కావు.
10 That is why snares surround you, and sudden terror overwhelms you; అందుకే ఉరులు నిన్ను చుట్టుకున్నాయి, ఆకస్మిక ప్రమాదం నిన్ను భయపెడుతుంది.
11 or darkness, so that you cannot see, and a flood of water covers you. అందుకే ఏమీ చూడలేనంతగా చీకట్లు నిన్ను కమ్ముకున్నాయి, వరదనీరు పొంగి నిన్ను ముంచేస్తున్నాయి.
12 Is not God in the heights of heaven? See how high the highest stars are! “దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!
13 Yet you say, 'What does God know? Can he judge through such deep darkness? అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?
14 Thick clouds veil him so that he cannot see, and he walks on the vault of heaven.' ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.
15 Will you keep to the ancient path that wicked men have walked? దుష్టులు నడిచిన పాత మార్గంలోనే నీవు కూడా నడుస్తావా?
16 They were snatched away before their time, their foundation washed away by a flood. తమ గడువు తీరకముందే వారు కొనిపోబడ్డారు, వారి పునాదులు వరదల్లో కొట్టుకుపోయాయి.
17 They said to God, 'Leave us alone! What can the Almighty do to us?' దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో!
18 Yet it was he who filled their houses with good things—so I want nothing to do with the plans of the wicked. సర్వశక్తిమంతుడైన దేవుడు మాకేమి చేయగలడు?’ అంటారు కాబట్టి దుర్మార్గుల ప్రణాళికలకు నేను దూరంగా ఉంటాను.
19 The righteous see it and are glad; the innocent mock the wicked, saying, ‘మన పగవారు నాశనమైపోయారు, వారి సంపదను అగ్ని కాల్చివేసిందని’ చెప్పుకుంటూ, ఖచ్చితంగా నీతిమంతులు వారి నాశనాన్ని చూసి సంతోషిస్తారు; నిర్దోషులు వారిని ఎగతాళి చేస్తారు.
20 'Surely our enemies are destroyed, and the fire has consumed what they left behind.' Not in this edition
21 Submit to God now and be at peace with him; in this way good will come to you. “దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు; దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది.
22 Receive instruction from his mouth, and store up his words in your heart. ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.
23 If you return to the Almighty you will be restored; if you drive injustice far from your home, ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి
24 and lay your gold in the dust, the gold of Ophir among the stones of the streambed, నీ బంగారాన్ని మట్టిలో ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే,
25 then the Almighty himself will be your gold, your precious silver. అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.
26 Then you will delight in the Almighty and lift up your face to God. అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.
27 You will pray to him, and he will hear you, and you will fulfill your vows. నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.
28 What you decide will be done, and light will shine on your ways. నీవు ఏది నిర్ణయించుకొంటే అది నీకు జరుగుతుంది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది.
29 When others are brought low and you say, 'Lift them up!', he will save the downcast. ప్రజలు తగ్గించబడినప్పుడు, ‘వారిని పైకి లేవనెత్తు!’ అని నీవు అంటావు అప్పుడు ఆయన దీనులను రక్షిస్తారు.
30 He will deliver even the one who is not innocent, who will be delivered through the cleanness of your hands." నిర్దోషి కాని వానిని కూడా ఆయన విడిపిస్తారు, నీ చేతుల శుద్ధి కారణంగా వారికి విడుదల కలుగుతుంది.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]