1అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు! 2వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు:“ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి;ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి;ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి;చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’
3“నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 4యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను.
5“యెరూషలేమా, నీ మీద ఎవరు జాలి చూపిస్తారు?నీకోసం ఎవరు దుఃఖిస్తారు?నీ క్షేమసమాచారం ఎవరు అడుగుతారు?
6నీవు నన్ను తిరస్కరించావు”అని యెహోవా ప్రకటిస్తున్నారు.“నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు.కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను;నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను.
7దేశపు పట్టణ ద్వారం దగ్గరనేను వారిని చేటతో చెరుగుతాను.నా ప్రజలు తమ మార్గాలను మార్చుకోలేదువారికి బంధువియోగం కలిగించి నాశనం చేస్తాను.
8నేను వారి విధవరాండ్ర సంఖ్యనుసముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను.మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికినాశనం చేసేవాన్ని రప్పిస్తాను;అకస్మాత్తుగా నేను వారి మీదికివేదనను, భయాందోళనను రప్పిస్తాను.
9ఏడుగురు పిల్లల తల్లి మూర్ఛపోయితుది శ్వాస విడుస్తుంది.పగలు ఉండగానే ఆమెకు ప్రొద్దు గ్రుంకుతుంది;ఆమె అవమానం పాలవుతుంది, కించపరచబడుతుంది.ప్రాణాలతో బయటపడిన వారినివారి శత్రువుల ముందు ఖడ్గానికి అప్పగిస్తాను”అని యెహోవా ప్రకటిస్తున్నారు.
10అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు,కలహాలు పెట్టుకునేవానిగా,నీవు నాకు జన్మనిచ్చావు!నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు,అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు.
11యెహోవా ఇలా అన్నారు,“ఖచ్చితంగా నేను నిన్ను మంచి ఉద్దేశంతో విడిపిస్తాను;ఆపద సమయాల్లోనూ, కష్ట సమయాల్లోనూనీ శత్రువులు నిన్ను సాయం కోరేలా నేను చేస్తాను.
12“ఉత్తరానికి చెందిన ఇనుమును గానిఇత్తడిని గాని ఎవరైనా విరగ్గొట్టగలరా?
13“మీ దేశమంతటామీరు చేసిన పాపాలన్నిటి కారణంగామీ సంపదను, మీ ఖజానాను నేనుఎలాంటి రుసుము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.
14నీకు తెలియని దేశంలోనీ శత్రువులకు నిన్ను బానిసగా చేస్తాను,నా కోపం మంటలు రేపుతుందిఅది నీకు వ్యతిరేకంగా మండుతుంది.”
15యెహోవా, మీరు అర్థం చేసుకోండి;నన్ను జ్ఞాపకముంచుకొని నా పట్ల శ్రద్ధ చూపండి.నన్ను హింసించేవారి మీద నా కోసం ప్రతీకారం తీర్చుకోండి.మీ ఓర్పును బట్టి నన్ను తీసుకెళ్లనివ్వకండి;మీ కోసం నేనెలా నిందలు అనుభవిస్తున్నానో ఆలోచించండి.
16మీ మాటలు దొరికినప్పుడు ఒకడు ఆహారం తిన్నట్లుగా నేను వాటిని తిన్నాను;అవే నాకు ఆనందం నా హృదయానికి సంతోషం,ఎందుకంటే సైన్యాల యెహోవా దేవుడు అనే,మీ పేరును నేను కలిగి ఉన్నాను.
17నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు,వారితో ఎప్పుడూ సంతోషించలేదు.మీ చేయి నా మీద ఉందిమీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను.
18అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు?నా గాయం ఎందుకు నయం చేయలేనిది?మీ సహాయం నమ్మలేని వాగులా,ఎండిపోయే ఊటలా వంటిది.
19కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు:“నీవు పశ్చాత్తాపపడితేమీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను.నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే,నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు.ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి,కాని నీవు వారివైపు తిరగకూడదు.
20నిన్ను ఈ ప్రజలకు గోడగా,ఇత్తడి కోటగోడగా చేస్తాను;వారు నీతో పోరాడతారు,కాని నిన్ను జయించలేరు,ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికినేను నీతో ఉన్నాను,”అని యెహోవా ప్రకటిస్తున్నారు.
21“దుష్టుల చేతుల నుండి నేను నిన్ను రక్షించిక్రూరమైన వారి పట్టు నుండి నిన్ను విడిపిస్తాను.”