Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 24 OTSA

Side by side with the Father's Heart Bible™

యెహోవా భూమిని నాశనం చేయుట

1చూడండి, యెహోవా భూమిని పాడుచేసినాశనం చేయబోతున్నారు;ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసిదానిలో నివసించేవారిని చెదరగొడతారు.

2అందరికి ఒకేలా ఉంటుంది;ప్రజలకు కలిగినట్లే యాజకునికి,సేవకునికి కలిగినట్లే యజమానికి,సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి,కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి,అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి,వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది.

3భూమి పూర్తిగా పాడుచేయబడిపూర్తిగా దోచుకోబడుతుంది.యెహోవా ఈ మాట చెప్పారు.

4భూమి ఎండిపోయి వాడిపోతుంది,లోకం క్షీణించి వాడిపోతుంది,ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.

5భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది;వారు చట్టాలకు లోబడలేదు,వారు కట్టడలను ఉల్లంఘించారువారు నిత్యనిబంధనను భంగం చేశారు.

6కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది;దాని ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి.కాబట్టి భూనివాసులు కాలిపోయారుకేవలం కొద్దిమంది మిగిలారు.

7క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది;సంతోషంగా ఉన్నవారు మూల్గుతారు.

8ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి,కేకలు వేసే వారి ధ్వని ఆగిపోయిందిఆనందంగా ఉన్న సితార నిశ్శబ్దంగా ఉంది.

9ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు;మద్యం త్రాగే వారికి అది చేదుగా మారింది.

10శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది;ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది.

11ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు;ఆనందమంతా దిగులుగా మారుతుంది,దేశం ఆనంద ధ్వనులన్నీ నిషేధించబడ్డాయి.

12పట్టణం శిథిలాల్లో ఉన్నది,దాని గుమ్మం ముక్కలుగా విరిగిపోయింది.

13ఒలీవ చెట్టుని దులిపినప్పుడు,ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగాభూమి మీదభూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.

14వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు;పశ్చిమ నుండి వారు యెహోవా గొప్పతనాన్ని కొనియాడుతారు.

15కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి.సముద్ర ద్వీపవాసులారా,ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.

16భూమి అంచుల నుండి మేము ఇలా పాడడం వింటున్నాము:“నీతిమంతునికి ఘనత.”అయితే నేను అన్నాను, “నేను చెడిపోయాను, చెడిపోయాను!నాకు శ్రమ!మోసగాళ్ళు ద్రోహం చేస్తారు,మోసగాళ్ళు మోసంతో ద్రోహం చేస్తారు!”

17భూలోక ప్రజలారా!మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి.

18భయంకరమైన శబ్దం విని ఎవరైతే పారిపోతారోవారు గుంటలో పడతారు;ఎవరైతే గుంటలో నుండి పైకి వస్తారో,వారు ఉరిలో చిక్కుకుంటారు.ఆకాశపు తూములు తెరవబడ్డాయిభూమి పునాదులు కదిలాయి.

19భూమి బద్దలై పోయింది,భూమి ముక్కలుగా చీలిపోయింది,భూమి భయంకరంగా అదురుతుంది.

20భూమి త్రాగుబోతులా తూలుతుంది,గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది.దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉందిఅది ఇక లేవనంతగా పడిపోతుంది.

21ఆ రోజున యెహోవాపైన ఆకాశాల్లో ఉన్న శక్తులను,భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.

22చెరసాలలో బంధించబడిన ఖైదీలవలెవారు చెరసాలలో వేయబడతారు.చాలా రోజులు అక్కడ ఉన్న తర్వాతవారు శిక్షించబడతారు.

23చంద్రుడు దిగులు చెందుతాడుసూర్యుడు సిగ్గుపడతాడు;సైన్యాల యెహోవాసీయోను కొండమీద యెరూషలేములో,దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]