Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 23 OTSA

Side by side with the Father's Heart Bible™

తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం

1తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం:తర్షీషు ఓడలారా! రోదించండి:తూరు నాశనమయ్యింది,అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది.కుప్ర దేశం నుండిఈ విషయం వారికి తెలియజేయబడింది.

2సముద్ర తీర వాసులారా,సీదోను వ్యాపారులారా, మౌనంగా ఉండండి,సముద్ర నావికులు మిమ్మల్ని సంపన్నులుగా చేశారు.

3గొప్ప జలాల మీదషీహోరు ధాన్యం వచ్చింది;నైలు ప్రాంతంలో పండిన పంట తూరుకు ఆదాయం ఇచ్చింది,అది దేశాలకు వాణిజ్య కేంద్రంగా మారింది.

4సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి,సముద్రం ఇలా మాట్లాడింది:“నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు,కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.”

5వార్త ఈజిప్టుకు చేరినప్పుడుతూరు గురించి వారు వేదన పడతారు.

6తర్షీషుకు వెళ్లండి;సముద్ర తీర వాసులారా దుఃఖపడండి.

7మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా?పాతది, ప్రాచీన పట్టణం,దూరదేశంలో నివసించడానికిసుదూర ప్రయాణం చేసింది ఇదేనా?

8తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం,దాని వ్యాపారులు రాకుమారులు,దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు,అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?

9తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికిభూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికిసైన్యాల యెహోవా ఇలా చేశారు.

10తర్షీషు కుమారీ,నీ దేశానికి ఇక ఓడరేవు లేదు కాబట్టినైలు నది దాటునట్లు మీ దేశానికి తిరిగి వెళ్లు.

11యెహోవా సముద్రం మీద తన చేయి చాపిదాని రాజ్యాలు వణికేలా చేశారు.కనాను కోటలను నాశనం చేయడానికిఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు.

12ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె,ఇకపై నీకు సంతోషం ఉండదు.“నీవు లేచి కుప్రకు వెళ్లు,అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.”

13బబులోనీయుల దేశాన్ని చూడు,వారు తమ గుర్తింపును కోల్పోయారు!అష్షూరీయులు దానినిఎడారి జీవులకు నివాసంగా చేశారు.వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి,దాని కోటలు పడగొట్టిశిథిలాలుగా మార్చారు.

14తర్షీషు ఓడలారా, రోదించండి;మీ కోట నాశనమయ్యింది.

15ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది:

16“మరవబడిన వేశ్యా,సితారా తీసుకుని పట్టణంలో తిరుగు;నీవు జ్ఞాపకం వచ్చేలాసితారా మంచిగా వాయిస్తూ చాలా పాటలు పాడు.”

17డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది. 18అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]