Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Proverbs 3 OTSA

Show OTSA only
Verse × ×
1 My son, do not forget my teaching, but let your heart keep my commandments, నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో,
2 for they will add length of days and years of life and peace to you. అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి, నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి.
3 Do not let covenant love and faithfulness leave you; bind them around your neck, write them on the tablet of your heart. ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; నీ మెడలో వాటిని ధరించుకో, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో.
4 So you will find favor and a good reputation with our Father and with people. అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు.
5 Trust in our Father with all your heart, and do not lean on your own understanding. నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
6 In all your ways know him, and he will make your paths straight. నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.
7 Do not be wise in your own eyes; fear our Father, and turn away from evil. నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.
8 This will bring healing to your body and refreshment to your bones. అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలం కలుగుతుంది.
9 Honor our Father with your wealth and with the firstfruits of all your produce, నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు;
10 then your barns will be filled with plenty, and your vats will overflow with new wine. అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి, నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి.
11 My son, do not despise the discipline of our Father or be weary of his correction, నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
12 for our Father disciplines the one his heart loves, just as a father disciplines the son he delights in. ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
13 Blessed is the one who finds wisdom, and the one who gains understanding, జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు, వివేచన కలిగినవారు ధన్యులు.
14 for the gain from her is better than gain from silver, and her profit better than gold. ఎందుకంటే ఆమె వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం, ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది.
15 She is more precious than jewels, and nothing you desire can compare with her. ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది; నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు.
16 Long life is in her right hand; in her left hand are riches and honor. దాని కుడి చేతిలో దీర్ఘాయువు; ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి.
17 Her ways are pleasant, and all her paths are peace. దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి దాని త్రోవలన్ని సమాధానకరమైనవి.
18 She is a tree of life to those who take hold of her; those who hold her fast are called blessed. ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది; దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు.
19 Our Father by wisdom founded the earth; by understanding he established the heavens; యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు, ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు;
20 by his knowledge the depths burst open, and the clouds drop down the dew. ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి. మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి.
21 My son, do not lose sight of these; keep sound wisdom and discretion, నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు;
22 and they will be life for your soul and an adornment for your neck. అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి.
23 Then you will walk on your way securely, and your foot will not stumble. అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు.
24 If you lie down, you will not be afraid; when you lie down, your sleep will be sweet. నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది.
25 Do not be afraid of sudden terror, or of the ruin of the wicked when it comes, హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు.
26 for our Father will be your confidence and will keep your foot from being caught. యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.
27 Do not withhold good from those who deserve it, when it is in your power to do it. నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.
28 Do not say to your neighbor, "Go, and come back, and tomorrow I will give it"—when you have it with you. నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, “రేపు రా నేను ప్రయత్నిస్తాను” అని నీ పొరుగువానితో అనవద్దు.
29 Do not plot evil against your neighbor, who lives trustingly beside you. నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు.
30 Do not quarrel with anyone for no reason, when he has done you no harm. నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు.
31 Do not envy a violent man, and do not choose any of his ways, హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.
32 for the devious person is detestable to our Father, but he takes the upright into his confidence. మూర్ఖులు యెహోవాకు అసహ్యులు కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.
33 The curse of our Father is on the house of the wicked, but he blesses the home of the righteous. దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.
34 Toward the mockers he is scornful, but to the humble he gives grace. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.
35 The wise will inherit honor, but fools get only disgrace. జ్ఞానులు ఘనతను పొందుతారు, మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]