Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 32 OTSA

Show OTSA only
Verse × ×
1 So these three men stopped answering Job, because he was righteous in his own eyes. యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు.
2 Then the anger of Elihu son of Barachel the Buzite, of the family of Ram, burned hot. His anger burned against Job because he justified himself rather than God. దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.
3 His anger also burned against Job's three friends, because they had found no answer and yet had condemned Job. అతడు ముగ్గురు మిత్రులపై కూడా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వారు యోబు తప్పు అని నిరూపించడం చేతకాకపోయినా, వారు అతన్ని ఖండించారు.
4 Now Elihu had waited to speak to Job because the others were older than he. వారందరు తనకన్నా పెద్దవారు కాబట్టి యోబుతో మాట్లాడాలని ఎలీహు ఎదురుచూశాడు.
5 But when Elihu saw that these three men had nothing to say, his anger burned. కాని ఆ ముగ్గురు స్నేహితులు ఇంకేమి మాట్లాడకపోవడంతో అతనికి చాలా కోపం వచ్చింది.
6 So Elihu son of Barachel the Buzite spoke up and said: "I am young in years, and you are old; that is why I held back, afraid to tell you what I know. బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు: నేను వయస్సులో చిన్నవాన్ని, మీరు పెద్దవారు; అందుకే నేను భయపడ్డాను, నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు.
7 I thought, 'Let age speak, and many years teach wisdom.' ముందుగా వయస్సు మాట్లాడాలి; గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను.
8 But it is the spirit in a person, the breath of the Almighty, that gives understanding. అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.
9 It is not the old who are wise, nor the elderly who understand what is right. కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.
10 So I say, listen to me; I too will tell what I know. కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి; నాకు తెలిసింది మీకు చెప్తాను.
11 Look, I waited for your words; I listened for your reasoning while you searched for what to say. మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు, మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను; నేను మీ అభిప్రాయాలను విన్నాను,
12 I gave you my full attention; but not one of you proved Job wrong or answered his arguments. మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను; అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు; అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.
13 So do not say, 'We have found wisdom; let God refute him, not man.' మాకు జ్ఞానం లభించింది; మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.
14 Job has not marshaled his words against me, and I will not answer him with your arguments. కాని యోబు నాతో వాదించలేదు, మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను.
15 They are dismayed and have no more to say; words have failed them. వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు; వారికి మాటలు దొరకలేదు.
16 Must I wait, now that they are silent, now that they stand there with no reply? వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు, వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా?
17 I too will have my say; I too will tell what I know. నేను కూడా చెప్పాల్సింది చెప్తాను; నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.
18 For I am full of words; the spirit within me compels me. ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి, నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది.
19 Inside, I am like wine that has no vent, like new wineskins ready to burst. నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది, క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది.
20 I must speak and find relief; I must open my lips and answer. నేను మాట్లాడి ఉపశమనం పొందాలి; నా నోరు తెరచి సమాధానం ఇస్తాను.
21 I will show no partiality to anyone, and I will flatter no one; నేను పక్షపాతం చూపించను, ఏ మనుష్యుని పొగడను;
22 for I do not know how to flatter—if I did, my Maker would soon take me away." ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]