Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Job 33 OTSA

Show OTSA only
Verse × ×
1 "But now, Job, hear my words; listen to everything I say. “యోబూ, ఇప్పుడు నా మాటలు విను; నేను చెప్పే ప్రతిదాన్ని ఆలకించు.
2 Look, I have opened my mouth; my tongue forms words on my palate. నేను నోరు తెరిచి మాట్లాడబోతున్నాను; నా మాటలు నా నాలుక చివర ఉన్నాయి.
3 My words come from an upright heart, and my lips speak sincerely what they know. యథార్థమైన హృదయం నుండి నా మాటలు వస్తున్నాయి; నాకు తెలిసిన దానిని నా పెదవులు నిష్కపటంగా పలుకుతాయి.
4 The Spirit of God has made me, and the breath of the Almighty gives me life. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది; సర్వశక్తిమంతుని ఊపిరి నాకు జీవమిచ్చింది.
5 Answer me, if you can; set your case in order before me, and take your stand. నీకు చేతనైతే నాకు జవాబు చెప్పు; నా ముందు నిలబడి నీ వాదన వినిపించు.
6 Look, I am just like you before God; I too was pinched off from clay. దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే; నేను కూడా మట్టితో చేయబడ్డాను.
7 No dread of me should terrify you, and no pressure from me should weigh you down. నా భయం నిన్ను భయపెట్టకూడదు, నా చేయి నీ మీద భారంగా ఉండకూడదు.
8 "Surely you have said in my hearing—I heard the very sound of your words. “నేను వింటుండగా నీవు మాట్లాడావు నీ మాటలు నేను విన్నాను.
9 'I am pure, without rebellion; I am clean, and there is no guilt in me. అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు; నేను శుద్ధుడను పాపం లేనివాడను.
10 Yet he finds fault with me; he counts me as his enemy. అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు; నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు.
11 He puts my feet in the stocks; he watches all my paths.' నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు. నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’
12 "But in this you are not right, I answer you, for God is greater than any mortal. “కాని ఈ విషయంలో నీవు తప్పు, ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.
13 Why do you contend against him, that he answers none of a person's words? ఒకని మాటలకు ఆయన స్పందించరని ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?
14 For God speaks in one way, and then another, though no one perceives it. ఎందుకంటే దేవుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు, అయితే ఎవరు దానిని గ్రహించలేరు.
15 In a dream, in a vision of the night, when deep sleep falls on people as they slumber on their beds, ప్రజలు పడకపై పడుకుని, గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చే కలలో,
16 then he opens their ears and impresses his warnings upon them, నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి, గోతిలో పడకుండ వారిని కాపాడడానికి, ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.
17 to turn a person from wrongdoing and to keep a man from pride, Not in this edition
18 he holds back their soul from the pit, their life from perishing by the sword. Not in this edition
19 "A person is also rebuked with pain on his bed, with constant aching in his bones, “లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు.
20 so that his life loathes bread, and his soul the choicest food. అప్పుడు వారికి అన్నం సహించదు వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.
21 His flesh wastes away, and his bones, once hidden, stick out. వారి మాంసం కృషించిపోయి, ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.
22 His soul draws near the pit, and his life to those who bring death. వారు సమాధికి దగ్గరవుతారు, వారి ప్రాణాలు మరణ దూతలకు దగ్గరవుతాయి.
23 "If there is a messenger for him, a mediator—one out of 1,000—to declare to a person what is right for him, అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే, వేలాది దేవదూతల్లో ఒక దూతను, మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,
24 and is gracious to him and says, 'Spare him from going down to the pit; I have found a ransom,' ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.
25 then his flesh grows fresher than a child's; he returns to the days of his youth. అప్పుడు వారి దేహం చిన్నపిల్లల దేహంలా ఉంటుంది; వారికి తమ యవ్వనకాలం తిరిగి వస్తుంది.’
26 He prays to God, and the worshiper is accepted by him; the worshiper sees God's face with shouts of joy, and God restores his righteousness to that person. అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.
27 He sings out before others and says, 'I sinned and twisted what was right, yet it was not repaid to me. వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.
28 He redeemed my soul from going down to the pit, and I will see the light.' సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు. జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’
29 "Look, God does all these things again and again with a person, “జీవిత వెలుగు వారి మీద ప్రకాశించేలా వారిని సమాధి నుండి తప్పించడానికి, దేవుడు మానవుల కోసం వీటన్నిటిని రెండు, మూడు సార్లైనా చేస్తారు.
30 to bring back his soul from the pit, that he may be lit with the light of the living. Not in this edition
31 "Pay attention, Job; listen to me. Be silent, and I will speak. “యోబూ, నా మాటలు విను; శ్రద్ధగా ఆలకించు, మౌనంగా ఉండు, నేను మాట్లాడతాను.
32 If you have anything to say, answer me; speak, for I would gladly see you justified. నీవు చెప్పవలసినది ఏదైనా ఉంటే నాతో చెప్పు; మాట్లాడు, నీ దోషమేమీ లేదని నేను నిరూపించదలిచాను.
33 If not, then listen to me; be silent, and I will teach you wisdom." కాని ఒకవేళ ఏమిలేకపోతే, నేను చెప్పేది విను; మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]