1“యవ్వనస్త్రీని కామదృష్టితో చూడననినేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను.
2పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం,ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి?
3అది దుష్టులకు పతనం,తప్పు చేసేవారికి విపత్తు కాదా?
4ఆయన నా మార్గాలను చూడరానా ప్రతి అడుగును లెక్కించరా?
5“ఒకవేళ నేను అబద్ధంతో నడచి ఉంటేమోసం వైపు నా పాదం తొందరపడి ఉంటే
6దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక,అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు.
7ఒకవేళ నా అడుగులు త్రోవ నుండి తొలగి ఉంటే,ఒకవేళ నా హృదయం నా కళ్ల చేత నడిపించబడి ఉంటే,నా చేతులు అపవిత్రం అయి ఉంటే,
8అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక,నా పంటలు పెరికివేయబడును గాక.
9“ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని చేత మోహించినా,నేను నా పొరుగువాని తలుపు దగ్గర వాని భార్య కోసం పొంచి ఉంటే,
10నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక,ఇతర పురుషులు ఆమెతో పడుకొందురు గాక.
11ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది,ఒక శిక్షించవలసిన పాపము.
12అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని;అది నా ఆదాయాన్ని సమూలంగా నాశనం చేసి ఉండేది.
13“ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా,ఆడవారికైనా లేదా మగవారికైనా నా మీద ఆయాసం ఉన్నప్పుడు,నేను వారికి న్యాయం నిరాకరించి ఉంటే,
14దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను?లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను?
15గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా?మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?
16“ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినావిధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,
17ఒకవేళ అనాధలకు పెట్టకుండానేనే ఒంటరిగా భోజనం చేసినా
18కాని నా యవ్వనకాలం నుండి నేను వారిని తండ్రిలా పోషించాను,నేను పుట్టినప్పటి నుండి విధవరాండ్రకు దారి చూపించాను;
19ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక,కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు,
20నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను,అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,
21నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి,ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,
22అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక,దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.
23దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి,ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.
24“నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా,‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,
25ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి,నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే,
26నేను సూర్యుడిని దాని ప్రకాశంలోచంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,
27నా హృదయం రహస్యంగా ఆకర్షించబడినా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే,
28అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి,ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.
29“ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తేవారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే,
30వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారానా నోటిని పాపానికి అనుమతించలేదు
31‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’అని నా ఇంటివారు ఎన్నడు అనలేదా
32ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు,ఎందుకంటే బాటసారులకు నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది
33మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ,నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా?
34నేను గుంపులకు భయపడి గానివంశాల ధిక్కారానికి బెదిరిపోయి గానినేను బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయానా?
35“ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది!నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక;నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక.
36ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను,నేను దానిని కిరీటంగా పెట్టుకుంటాను.
37ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను,పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను.
38“నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటేదున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,
39వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినాదాని యజమానులకు ప్రాణాపాయం తల పెట్టినా,
40అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలుయవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక.”యోబు తన మాటలు ముగించాడు.