Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Jeremiah 10 OTSA

Side by side with the Father's Heart Bible™

సజీవుడైన దేవుడు విగ్రహాలు

1ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి. 2యెహోవా ఇలా చెప్తున్నారు:“ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దుఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా,మీరు భయపడవద్దు.

3ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి;వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు,హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు.

4వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు;కదలకుండా ఉండేలా,సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు.

5దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా,వారి విగ్రహాలు మాట్లాడలేవు;అవి నడవలేవు కాబట్టివాటిని మోయాలి.వాటికి భయపడవద్దు;అవి ఏ హాని చేయలేవుఅలాగే ఏ మేలు కూడా చేయలేవు.”

6యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు;మీరు గొప్పవారు,మీ నామం ఘనమైనది.

7దేశాలకు మీరు రాజు,మిమ్మల్ని గౌరవించని వాడెవడు?గౌరవం మీకు చెందినదే.దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలోవారి రాజ్యాలన్నిటిలో,మీలాంటి వారెవ్వరూ లేరు.

8వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు;వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.

9తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండిఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి.హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసినవాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు,అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.

10అయితే యెహోవాయే నిజమైన దేవుడు;ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు.ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది;ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.

11“వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”

12అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు;ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు,తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.

13ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి;ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు.ఆయన వర్షంతో మెరుపులు పంపితన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

14మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు;ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు.అతడు చేసే చిత్రాలు మోసం;వాటిలో ఊపిరి లేదు.

15అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి;వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

16యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు,ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు,అన్నిటిని సృజించారు.ఆయన పేరు సైన్యాల యెహోవా.

రాబోతున్న నాశనం

17ఆక్రమణలో ఉంటున్నవారలారా,దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి.

18ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు:“ఈ సమయంలో నేనుఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను.వారు పట్టబడేలానేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.”

19నా గాయం వల్ల నాకు శ్రమ!నా గాయం మానిపోయేది కాదు!అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి”అని నాలో నేను చెప్పుకున్నాను.

20నా గుడారం నాశనమైంది;దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి.నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు;నా గుడారం వేయడానికినాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.

21కాపరులు తెలివిలేనివారువారు యెహోవా దగ్గర విచారణ చేయరు;కాబట్టి వారు వర్ధిల్లరువారి మంద అంతా చెదరిపోయింది.

22వినండి! నివేదిక వస్తుందిఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం!అది యూదా పట్టణాలను నిర్జనంగా,నక్కల విహారంగా చేస్తుంది.

యిర్మీయా ప్రార్థన

23యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు;తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.

24యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమేమీ కోపంలో కాదు,లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.

25మిమ్మల్ని గుర్తించనిదేశాల మీద,మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి.వారు యాకోబును మ్రింగివేశారు;వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారుఅతని మాతృభూమిని నాశనం చేశారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]