Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 8 OTSA

Side by side with the Father's Heart Bible™

సూచనలుగా యెషయా, అతని పిల్లలు

1యెహోవా నాతో ఇలా అన్నారు, “నీవు పెద్ద పలక తీసుకుని దానిపై మహేర్-షాలాల్-హాష్-బజ్ అని సామాన్యమైన అక్షరాలతో వ్రాయి. 2నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి యాజకుడైన ఊరియాను, యేబెరెక్యా కుమారుడైన జెకర్యాను పిలిచాను. 3తర్వాత నేను ప్రవక్త్రితో శయనించగా ఆమె గర్భవతియై కుమారునికి జన్మనిచ్చింది. అప్పుడు యెహోవా, ‘అతనికి మహేర్-షాలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టు’ అని నాతో చెప్పారు. 4ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”

5యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:

6“ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటినివద్దు అని,రెజీను గురించి,రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,

7కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటినిఅనగా అష్షూరు రాజును, అతని బలగమంతటినివారి మీదికి రప్పించబోతున్నారు.అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగిదాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.

8అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ,గొంతు లోతు వరకు చేరుతాయి.ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలునీ దేశమంతట వ్యాపిస్తాయి.”

9దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు!దూర దేశాల్లారా! మీరందరూ వినండి.యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!

10మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది;మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు,ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.

11ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:

12“ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్నికుట్ర అనకండి.వారు భయపడే దానికి భయపడకండి.దానికి బెదిరిపోకండి.

13సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి,ఆయనకే మీరు భయపడాలి,ఆయనకే మీరు భయపడాలి.

14ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు;అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకుప్రజలను తడబడేలా చేసే రాయిలావారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు.ఆయన యెరూషలేము ప్రజలకుబోనుగా, ఉచ్చుగా ఉంటారు.

15వారిలో అనేకమంది తడబడతారు;వారు పడిపోతారు, గాయపరచబడతారువారు ఉచ్చులో చిక్కుకుని పట్టబడతారు.”

16ఈ హెచ్చరిక సాక్ష్యాన్ని కట్టండిదేవుని బోధను నా శిష్యుల మధ్యలో ముద్రించండి.

17యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్నయెహోవా కోసం నేను ఎదురుచూస్తాను.ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.

18ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.

చీకటి వెలుగుగా మారుట

19మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి? 20దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు. 21వారు బాధపడుతూ ఆకలితో దేశమంతా తిరుగుతారు; వారు ఆకలితో ఉన్నప్పుడు వారు కోపంతో పైకి చూస్తూ తమ రాజును, తమ దేవుని శపిస్తారు. 22వారు భూమివైపు చూడగా వారికి బాధ, చీకటి, భయంకరమైన దుఃఖం మాత్రమే కనబడతాయి. వారు దట్టమైన చీకటిలోకి త్రోయబడతారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]