Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 54 OTSA

Show OTSA only
Verse × ×
1 Sing, barren woman who never bore a child; burst into song and shout for joy, you who were never in labor! For the children of the desolate woman will be more than the children of the married woman, says our Father. “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
2 Enlarge your tent, and let the curtains of your dwelling spread wide; do not hold back. Lengthen your cords and drive your stakes deep, “నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా ముందుకు పొడిగించు నీ త్రాళ్లను పొడవుగా చేయి. నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.
3 for you will spread out to the right and to the left; your children will possess the nations and resettle the desolate cities. నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.
4 Do not be afraid, for you will not be ashamed; do not be discouraged, for you will not be disgraced. You will forget the shame of your youth and remember no more the disgrace of your widowhood. “భయపడకు; నీవు సిగ్గుపరచబడవు అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు. నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు.
5 For your Maker is your husband—the Father of heaven's armies is his name; the Holy One of Israel is your Redeemer, our Father of the whole earth he is called. నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.
6 For our Father has called you back like a wife forsaken and brokenhearted, like the wife of one's youth when she has been abandoned, says your Father. విడిచిపెట్టబడి మనోవేదనకు గురైన భార్యను భర్త పిలిచినట్లు తిరస్కరించబడిన యవ్వనంలో ఉన్న భార్యను భర్త పిలిచినట్లు, యెహోవా నిన్ను తిరిగి పిలుస్తారు” అని నీ దేవుడు చెప్తున్నారు.
7 For a brief moment I abandoned you, but with great compassion I will gather you back. “కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.
8 In a flood of anger I hid my face from you for a moment, but with everlasting love my heart goes out to you, says our Father, your Redeemer. తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.
9 To me this is like the days of Noah, when I swore that the waters of Noah would never again flood the earth; so now I have sworn not to be angry with you or rebuke you. “ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని నేను ప్రమాణం చేశాను.
10 Though the mountains may depart and the hills be shaken, my loyal love will not depart from you, and my covenant of peace will not be shaken, says our Father, whose heart goes out to you in compassion. పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.
11 "Afflicted one, storm-tossed and without comfort, look: I will set your stones in antimony and lay your foundations with sapphires. “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, నీలమణులతో నీ పునాదులను వేస్తాను.
12 I will make your towers of rubies, your gates of sparkling jewels, and all your walls of precious stones. రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.
13 All your children will be taught by our Father, and great will be the peace of your children. యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.
14 In righteousness you will be established; you will be far from oppression, for you will have nothing to fear, and far from terror, for it will not come near you. నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు.
15 If anyone stirs up strife against you, it is not from me; whoever attacks you will fall before you. ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు; నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు.
16 See, it is I who created the smith who fans the coals into flame and forges a weapon fit for its work; and it is I who created the destroyer to ravage." “చూడు, నిప్పులు ఊది మండించి తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే కమ్మరిని సృజించింది నేనే. నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే.
17 No weapon forged against you will succeed, and you will refute every tongue raised against you in court. This is the inheritance of the servants of our Father, and their vindication is from me, declares our Father. నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]