Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Habakkuk 2 OTSA

Side by side with the Father's Heart Bible™

1నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకునినగర గోడపై నిలబడి ఉంటాను;ఆయన నాతో ఏమి చెప్తాడో,ఈ ఫిర్యాదుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను.

యెహోవా జవాబు

2యెహోవా నాకిలా జవాబిచ్చారు:“ప్రకటించేవాడు పరుగెడుతూ సులభంగా చదవడానికి వీలుగాదర్శన సందేశాన్నిపలక మీద స్పష్టంగా వ్రాయి.

3దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది;అది అంతం గురించి మాట్లాడుతుందిఅది తప్పక నెరవేరుతుంది.అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి;ఇది ఖచ్చితంగా జరుగుతుందిఆలస్యం కాదు.

4“చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినాఅతడు అతిశయపడుతున్నాడు;కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.

5ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది;గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు.అతనికి పాతాళమంత దురాశ ఉన్నందునమరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు,అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడుప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.

6“అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు,“ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసిబలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ!ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’

7అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా?వారు లేచి నీకు వణుకు పుట్టించరా?అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.

8నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి,మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు.నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలనువాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.

9“తనకు నాశనం కలుగకుండా తన నివాసాన్ని ఎత్తు చేసుకునిఅన్యాయమైన సంపాదనతోతన ఇంటిని నిర్మించుకునే వారికి శ్రమ!

10అనేక ప్రజలను నాశనం చేయడానికి కుట్రచేసినీ ఇంటివారి మీదికి అవమానం తెచ్చుకుని నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు.

11గోడ రాళ్లు మొరపెడతాయి,చెక్క దూలాలు వాటిని ప్రతిధ్వనింపచేస్తాయి.

12“రక్తం చిందించి పట్టణాన్ని నిర్మించేవారికిఅన్యాయంతో ఊరిని స్థాపించేవారికి శ్రమ!

13ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని,వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారనిసైన్యాల యెహోవా నిర్ణయించలేదా?

14నీళ్లు సముద్రాన్ని కప్పినట్లుయెహోవా మహిమాన్విత జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.

15“తన పొరుగువారి నగ్న శరీరాలను చూడాలని,వారు మత్తులో మునిగిపోయేలాకోపంతో వారికి ద్రాక్షరసం పోసేవారికి శ్రమ!

16కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుందికాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు.యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది,అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.

17లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది,పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది.నీవు మనుష్యులను హత్య చేసినందుకు,దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.

18“శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి?అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి?ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసినతాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?

19చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అనినిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ!అది దారి చూపించగలదా?అది బంగారం వెండితో పూత వేయబడింది;దానిలో శ్వాస లేదు.”

20కాని, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు;ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]