Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ezekiel 31 OTSA

Side by side with the Father's Heart Bible™

నరికివేయబడిన లెబానోను దేవదారులా ఫరో

1పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి తేది యెహోవా వాక్కు నాకు వచ్చి: 2“మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు:“ ‘ఘనతలో నీకు సాటి ఎవరు?

3అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా,అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది;దాని చిటారు కొమ్మమిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.

4సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి,లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి;వాటి ప్రవాహాలుదాని మొదలు చుట్టూ ప్రవహించాయి,పొలంలో ఉన్న చెట్లన్నిటికిదాని కాలువలు నీరు అందించాయి.

5కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నాఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది;నీరు సమృద్ధిగా ఉన్నందున,దాని కొమ్మలు విస్తరించి,పెద్ద శాఖలుగా ఎదిగాయి.

6ఆకాశ పక్షులన్నీదాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి,అడవి జంతువులన్నీదాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి;గొప్ప జనాంగాలన్నీదాని నీడలో నివసించాయి.

7నీరు సమృద్ధిగా ఉన్న చోటికిదాని వేర్లు వ్యాపించాయి,కాబట్టి అది విస్తరించిన కొమ్మలతోఎంతో అందంగా ఉంది.

8దేవుని తోటలో దేవదారు వృక్షాలు కూడాదానితో పోటీపడలేకపోయాయి,సరళ వృక్షాలుదాని కొమ్మలతో సమానం కాలేవు,అక్షోట వృక్షాల కొమ్మలుదాని కొమ్మలతో పోల్చబడలేవు,దానికి ఉన్నంత అందందేవుని తోటలో ఉన్న ఏ చెట్టుకు లేదు.

9విస్తారమైన కొమ్మలతోనేను దానిని అందంగా తయారుచేశాను,దేవుని తోటయైన ఏదెను లోనిచెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.

10“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మహా దేవదారు చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఎత్తుగా ఉంది కాబట్టి అది గర్వపడింది. 11కాబట్టి దాని దుర్మార్గానికి తగినట్టుగా నేను దానిని దేశాల అధినేత చేతులకు అప్పగించాను. నేను దానిని విసిరివేశాను, 12విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి. 13కూలిపోయిన చెట్టు మీద ఆకాశ పక్షులన్నీ వాలాయి, కొమ్మల మధ్య అడవి జంతువులన్నీ నివసించాయి. 14కాబట్టి నీటి ప్రక్కన ఉన్న ఏ చెట్టు వాటి చిటారు కొమ్మలను గుబురుగా పెంచుకుని గర్వించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ఏ ఇతర చెట్లు అంత ఎత్తుకు ఎప్పటికీ ఎదగకూడదు; వాటన్నిటి గమ్యం మరణమే, భూమి దిగువన పాతాళంలోనికి దిగిపోయే సాధారణ మనుష్యుల్లా అవి చనిపోతాయి.

15“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. 16పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి. 17వారు కూడా గొప్ప దేవదారులా, ఖడ్గంతో చంపబడినవారి దగ్గరకు, జాతుల మధ్య దాని నీడలో నివసించిన సాయుధ పురుషులతో పాటు పాతాళానికి దిగారు.

18“ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]