Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ezekiel 30 OTSA

Side by side with the Father's Heart Bible™

ఈజిప్టు గురించి విలాప గీతం

1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:“ ‘రోదిస్తూ అనండి:“అయ్యో, శ్రమ దినం వచ్చిందే!”

3ఎందుకంటే ఆ రోజు వచ్చేసింది,యెహోవా దినం సమీపించింది,మబ్బులు కమ్ముకునే రోజు,జనాంగాలు శిక్షించబడే రోజు.

4ఈజిప్టు దేశం మీదికి ఖడ్గం దూసుకువస్తుంది,కూషు మీదికి వేదన వస్తుంది.ఈజిప్టులో హతులైనవారు పడిపోతుంటే,దాని సంపదను తీసుకెళ్లిపోతారు,దాని పునాదులు కూల్చివేయబడతాయి.

5కూషు వారు, లిబియా వారు (పూతు వారు), లిడియా వారు, అరేబియా అంతా, కూబు వారు, ఇంకా నిబంధన దేశపు ప్రజలు ఈజిప్టుతో పాటు ఖడ్గానికి కూలిపోతారు.

6“ ‘యెహోవా ఇలా చెప్తున్నారు:“ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు,దాని బల గర్వం అణిగిపోతుంది.మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలుదాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు.అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

7పాడైపోయిన దేశాల మధ్యఈజిప్టువారు దిక్కులేని వారవుతారు.శిథిలమైన పట్టణాల మధ్యవారి పట్టణాలు పడి ఉంటాయి.

8ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడిదాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడునేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

9“ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.

10“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే:“ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేనుఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను.

11ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకునిఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు.వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసిదేశమంతా శవాలతో నింపుతారు.

12నైలు నదిని ఎండిపోయేలా చేసిఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మేస్తాను.విదేశీయులచేత నేనుఆ దేశాన్ని అందులోని సమస్తాన్ని పాడుచేస్తాను.యెహోవానైన నేనే మాట ఇచ్చాను.

13“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే:“ ‘విగ్రహాలను నాశనం చేసిమెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను.ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు,ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.

14పత్రూసు పాడుచేస్తాను,సోయనులో అగ్ని పుట్టిస్తానుతేబేసుకు శిక్ష విధిస్తాను.

15ఈజిప్టుకు కోటయైనసీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను.తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.

16ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను.సీను వేదనతో మెలికలు తిరుగుతుంది.తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది;మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.

17హెలియోపొలిస్, పీ-బెసెతు యువకులుకత్తివేటుకు కూలిపోతారు,ఆ పట్టణస్థులు బందీలవుతారు.

18ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడుతహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది;దాని బల గర్వం అణచివేయబడుతుంది.దానిని మబ్బులు క్రమ్ముతాయిదాని కుమార్తెలు బందీగా వెళ్తారు.

19కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను.అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

విరిగిన ఫరో చేతులు

20పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: 21“మనుష్యకుమారుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో చేతిని విరగ కొట్టాను. అది బాగవ్వడానికి ఎవరూ దానికి కట్టు కట్టరు, అది కత్తి పట్టుకోడానికి కావలసినంత బలంగా మారడానికి బద్దపెట్టి కట్టరు. 22కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని అయ్యాను. బాగా ఉన్న చేతిని విరిగిపోయిన చేతిని రెండింటిని నేను విరగ్గొట్టి అతని చేతిలో నుండి కత్తి పడిపోయేలా చేస్తాను. 23ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. 24నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు. 25నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. 26ఈజిప్టువారిని ఇతర ప్రజల్లో చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]