Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ezekiel 28 OTSA

Side by side with the Father's Heart Bible™

తూరు రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం

1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:“ ‘గర్వించిన హృదయంతో నీవు,“నేనొక దేవుడిని;సముద్రం మధ్యలోఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు.దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు,కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.

3నీవు దానియేలు కన్నా జ్ఞానివా?నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?

4నీకున్న జ్ఞానంతో వివేకంతోనీకోసం సంపద సంపాదించుకునినీ ఖజానాలోవెండి బంగారాలను పోగు చేసుకున్నావు.

5వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతోనీ సంపదను వృద్ధి చేసుకున్నావు,నీ సంపదను బట్టినీవు హృదయంలో గర్వించావు.

6“ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు:“ ‘దేవునిలా నీవు జ్ఞానివిఅనుకుంటున్నావు కాబట్టి,

7నేను నీమీదికి విదేశీయులను,అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను;నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి,నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

8వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు.సముద్రం మధ్యలోభయంకరంగా చనిపోతావు.

9నిన్ను చంపేవారి ఎదుట“నేను దేవుడిని” అని చెప్తావా?నిన్ను చంపేవారి చేతుల్లోనీవు మనిషివే కాని దేవుడవు కావు.

10సున్నతిలేనివారు చనిపోయినట్లునీవు విదేశీయుల చేతిలో చస్తావుఅని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

11యెహోవా వాక్కు నాకు వచ్చి: 12“మనుష్యకుమారుడా, తూరు రాజు గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:“ ‘నీవు పరిపూర్ణతకు ముద్రగా,జ్ఞానంతో నిండి ఎంతో అందంగా ఉండేవాడివి.

13దేవుని తోటయైన,ఏదెనులో నీవు ఉండేవాడివి;ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు.మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి,కెంపు, సులిమాని, మరకతం,నీలమణి, పద్మరాగం,అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి;నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.

14అభిషేకం పొందిన కావలి కెరూబులానేను నిన్ను నియమించానుదేవుని పరిశుద్ధ పర్వతం మీద నీవున్నావు.నీవు కాలుతున్న రాళ్ల మధ్య నడిచావు.

15నీవు సృష్టించబడిన రోజు నుండినీలో దుష్టత్వం కనిపించిన రోజు వరకునీ ప్రవర్తన నిందారహితంగా ఉంది.

16అయితే నీ వ్యాపారం విస్తరించినీవు హింసతో నిండిపోయిపాపం చేశావు.కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను,కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్యనీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను.

17నీ సౌందర్యం చూసుకునినీ హృదయం గర్వించిందినీ వైభవం కారణంగానీ జ్ఞానం కలుషితమయ్యింది,కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను.రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.

18నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన,నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు.కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను.అది నిన్ను కాల్చివేస్తుంది,చూస్తున్న వారందరి ఎదుటనేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను.

19నిన్ను ఎరిగిన జనులంతా నిన్ను బట్టి వణికిపోతారు;నీవు భయానక ముగింపుకు వచ్చావునీవు పూర్తిగా నాశనమైపోతావు.’ ”

సీదోనుకు వ్యతిరేకం ప్రవచనం

20యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 21“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు: 22‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే:“ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని,నీ మధ్య నేను ఘనత పొందుతాను.నేను నీకు శిక్ష విధించినీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడునేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

23పట్టణం మీదికి తెగులు పంపించినీ వీధుల్లో రక్తం పారేలా చేస్తాను.అన్ని వైపుల నుండి నీ మీదికి వచ్చేకత్తివేటుకు వారు చనిపోతారు.అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

24“ ‘ఇశ్రాయేలీయుల పొరుగువారు ఇకపై గుచ్చుకుని బాధించే కంపలుగా పదునైన ముళ్ళుగా ఉండరు. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.

25“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ప్రజల్లో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చినప్పుడు వారి ద్వారా నేను ఆ ప్రజల ఎదుట పరిశుద్ధుడనని రుజువవుతాను. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన వారి దేశంలో వారు నివసిస్తారు. 26అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]