తూరు గురించి విలాపం
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు: 3సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:“ ‘తూరూ, నీవంటావు,“అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”
4నీ సరిహద్దులు సముద్రం మధ్యలో ఉన్నాయి;నీ భవన నిర్మాణకులు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.
5శెనీరు దేశపు సరళ పలకలతోవారు నీ ఓడలు తయారుచేస్తారు;లెబానోను దేవదారు చెక్కతోవారు ఓడ స్తంభాలు తయారుచేస్తారు.
6బాషాను సింధూర చెక్కతోవారు నీ తెడ్లు తయారుచేస్తారు.కుప్ర తీరం నుండి తెచ్చిన తమాల కలపతోవారు నీకు పీటలు తయారుచేసి ఏనుగు దంతంతో అలంకరించారు.
7ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగాజెండాగా పని చేశాయి;ఎలీషా తీరాల నుండి తెచ్చిననీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు.
8తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు;నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు.
9నీ ఓడను బాగుచేయడానికిగెబాలుకు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు.సముద్రంలో నీ వస్తువులు కొనడానికి,సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.
10“ ‘పర్షియా మనుష్యులారా, లిడియా, పూతుకు చెందినవారునీ సైన్యంలో సైనికులుగా పని చేశారు.వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీసి,నీకు వైభవాన్ని తెస్తున్నారు.
11అర్వాదు వారు, హెలెకు వారుఅన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు;గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు.వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు;వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.
12“ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు.
13“ ‘గ్రీసు, తుబాలు, మెషెకు వారు నీతో వ్యాపారం చేశారు; మనుష్యులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి మీ వస్తువులను కొన్నారు.
14“ ‘బేత్ తోగర్మా వారు మీ సరుకు కోసం రథ గుర్రాలు, అశ్వికదళ గుర్రాలు కంచరగాడిదలను ఇచ్చారు.
15“ ‘దేదాను వారు నీతో వ్యాపారం చేశారు, చాలా తీర ప్రాంతాల ప్రజలు నీ సరుకు కొన్నారు; వారు మీకు దంతపు దంతాలు, తునికి కలప ఇచ్చారు.
16“ ‘నీ దగ్గర ఉన్న అనేక వస్తువుల కారణంగా అరామీయులు నీతో వ్యాపారం చేశారు. వారు పచ్చరాళ్లను, ఊదా రంగు నూలుతో కుట్టుపని చేసిన వస్త్రాలు, సన్నని నారబట్టలు, కెంపులు రత్నాలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
17“ ‘యూదా వారు, ఇశ్రాయేలీయులు నీతో వ్యాపారం చేశారు. వారు మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, ఒలీవనూనె ఇచ్చి నీ సరుకు కొన్నారు.
18“ ‘దమస్కు నీ దగ్గర అనేక వస్తువులు విలువైన సరుకు ఉన్న కారణంగా నీతో వ్యాపారం చేసింది. వారు హెల్బోను నుండి ద్రాక్షరసం, జహరు నుండి ఉన్ని, 19వారు ఇజాలు నుండి ద్రాక్షరసం పీపాలు ఇచ్చి, అచ్చుపోసిన ఇనుము, లవంగపట్ట, వోమ ఇచ్చి మీ సరుకులు కొన్నారు.
20“ ‘దేదాను వారు నీతో జీను దుప్పట్ల వ్యాపారం చేశారు.
21“ ‘అరేబియా వారు కేదారు యువరాజులందరూ నీతో వ్యాపారం చేశారు. గొర్రెపిల్లలు పొట్టేళ్లు మేకలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
22“ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
23“ ‘హారాను వారు కన్నెహు వారు ఏదెను వారు షేబ వర్తకులు అష్షూరు కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24వారు వ్యాపారం చేసి అందమైన వస్త్రాలు, నీలం బట్టలు, కుట్టుపని చేసిన బట్టలు, తివాచీలు బాగా పేనిన గట్టి త్రాళ్లు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
25“ ‘తర్షీషు ఓడలునీ సరుకులు మోసుకెళ్లేవి.నీవు విస్తారమైన సరుకులతోసముద్రం మీద కూర్చున్నావు.
26నీ తెడ్లు నడిపేవారుమహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు.కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలోనిన్ను నాశనం చేస్తుంది.
27అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు,నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు,నీ వ్యాపారులు నీ సైనికులందరూ,నీతో ఉన్న ప్రతి ఒక్కరూనీ ఓడ ధ్వంసమైన రోజునసముద్రం మధ్యలో మునిగిపోతారు.
28నీ నావికులు వేసే కేకలకుతీరప్రాంతాలు కంపిస్తాయి.
29తెడ్డు నడిపే వారందరూనావికులు, ఓడ నాయకులుతమ ఓడల మీద నుండి దిగివచ్చితీరాన నిలబడతారు.
30వారంతా గొంతెత్తినీ గురించి ఏడుస్తారు;తమ తలలపై బూడిద చల్లుకునిబూడిదలో దొర్లుతారు.
31నీ గురించి వారు తమ తలలు గొరిగించుకునిగోనెపట్టలు కట్టుకునితీవ్రమైన దుఃఖంతోనీ గురించి ఏడుస్తారు;
32వారు నీ గురించి ఏడుస్తూవిలాప గీతం పాడతారు:“సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా!నీకు సాటియైన పట్టణమేదీ?”
33సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ,అనేకమందిని తృప్తిపరిచావు;నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతోభూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.
34ఇప్పుడు లోతైన జలాల్లో మునిగిసముద్రంలో నాశనమయ్యావు;నీ వస్తువులు నీ సహచరులునీతో పాటే మునిగిపోయారు.
35తీరప్రాంతాలలో ఉన్నవారంతానీ గురించి దిగులుపడతారు;వారి రాజులు వణకుతారు.వారి ముఖాలు చిన్నబోయాయి.
36వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు.నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు,పూర్తిగా నాశనం అవుతావు.’ ”