Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Zechariah 11 OTSA

Show OTSA only
Verse × ×
1 Open your doors, Lebanon—let fire devour your cedars! లెబానోనూ! అగ్ని వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేయునట్లు, నీ తలుపులు తీయి.
2 Wail, cypress, for the cedar has fallen, the majestic trees are ruined! Wail, oaks of Bashan, for the thick forest has come down! సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.
3 Listen—the wailing of the shepherds, for their glory is ruined! Listen—the roaring of young lions, for the thickets of the Jordan are ruined! గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! సింహాల గర్జన వినండి; యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!
4 This is what my Father says: Shepherd the flock marked for slaughter. నా దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు కాపరిగా ఉండు.
5 Their buyers slaughter them unpunished; their sellers say, "Praise God, I've grown rich!"—and their own shepherds show them no compassion. వాటిని కొనేవారు వాటిని వధించి శిక్ష పొందకుండా ఉన్నారు. వాటిని అమ్మేవారు, ‘యెహోవాకు స్తోత్రం, మాకు డబ్బు వచ్చింది!’ అని అంటారు. వాటి సొంత కాపరులే వాటి మీద జాలిపడరు.
6 For I will no longer pity the land's people, declares our Father. I am handing everyone over—each into the hand of his neighbor and his king; they will crush the land, and I will rescue no one from their hand. ఇకనుండి నేను ఈ దేశ ప్రజలపై కనికరం చూపించను. వారందరిని వారి పొరుగువారి చేతికి, వారి రాజు చేతికి నేను అప్పగిస్తాను. వారు దేశాన్ని పాడుచేస్తారు, నేను వారి చేతుల్లో నుండి ఎవరినీ విడిపించను” అని యెహోవా అంటున్నారు.
7 So I shepherded the flock marked for slaughter, the most oppressed of the flock. I took two staffs, naming one Favor and the other Union, and shepherded the flock. కాబట్టి వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు, ముఖ్యంగా మందలో బాధించబడిన వాటికి నేను కాపరిగా ఉన్నాను. రెండు కర్రలు పట్టుకుని కాపరిగా కాచాను. ఒక కర్రకు దయ అని, రెండవ కర్రకు బంధం అని పేరు పెట్టాను.
8 In one month I removed the three shepherds. I grew impatient with them, and they also hated me. ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను తీసివేశాను. మంద నన్ను అసహ్యించుకుంది; నేను వారిని చూసి విసిగిపోయి,
9 Then I said, "I won't shepherd you. Let the dying die, the doomed be destroyed, and those left devour one another's flesh." “నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.
10 I took my staff Favor and broke it, breaking the covenant I made with all the peoples. తర్వాత నేను దేశాలన్నిటినితో చేసిన నిబంధనను రద్దు చేయడానికి దయ అనే కర్రను తీసుకుని దానిని విరిచాను.
11 So it was broken that day, and the poor of the flock watching me knew this was the word of our Father. ఆ రోజు ఆ నిబంధన రద్దయింది కాబట్టి నేను చెప్పింది యెహోవా వాక్కు అని మందలోని అణచివేతకు గురై నా వైపు చూస్తున్నవారు తెలుసుకున్నారు.
12 I said to them, "If it seems right, give me my wages; if not, keep them." So they weighed out my wages—thirty pieces of silver. నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.
13 Then our Father said to me, "Throw it to the potter"—the grand price at which they valued me! So I took the thirty pieces of silver and threw them into the house of our Father, to the potter. అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
14 Then I broke my second staff, Union, annulling the brotherhood between Judah and Israel. తర్వాత యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధాన్ని తెంచడానికి బంధమనే నా రెండవ కర్రను విరిచాను.
15 Then our Father said to me, "Take up once more the gear of a foolish shepherd. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “బుద్ధిలేని గొర్రెల కాపరి సామాగ్రిని మరల తీసుకో.
16 For I am raising up a shepherd in the land who will not tend the perishing, not seek the scattered, not heal the broken, not sustain the healthy—but will eat the flesh of the fat ones and tear off their hooves. ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు.
17 Woe to my worthless shepherd, who deserts the flock! May the sword fall on his arm and on his right eye! Let his arm wither away completely, and his right eye go utterly blind!" “మందను విడిచిపెట్టిన పనికిమాలిన కాపరికి శ్రమ! ఖడ్గం అతని చేయి, కుడికన్నును నరుకుతుంది గాక! అతని చేయి పూర్తిగా ఎండిపోవాలి, అతని కుడికన్ను పూర్తిగా గ్రుడ్డిదవ్వాలి.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]