Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 17 OTSA

Side by side with the Father's Heart Bible™

దావీదు ప్రార్థన.

1యెహోవా, న్యాయమైన నా మనవి వినండి;నా మొర ఆలకించండి.నా ప్రార్థన వినండిఅది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.

2నాకు న్యాయమైన తీర్పు మీ నుండి రావాలి;మీ కళ్లు సరియైన దాన్ని చూడాలి.

3మీరు నా హృదయాన్ని పరిశీలించినప్పటికి,రాత్రివేళ మీరు నన్ను పరిశీలించి పరీక్షించినప్పటికీ,నాలో ఏ చెడు ఉద్దేశం మీకు కనబడలేదు;నా నోరు అతిక్రమించి మాట్లాడలేదు.

4మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా,మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టినేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.

5నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి;నా పాదాలు తడబడలేదు.

6నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు;మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి.

7మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి,తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారినిమీ కుడిచేతితో మీరు రక్షిస్తారు.

8నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి,నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండిమీ కనుపాపలా నన్ను కాపాడండి;మీ రెక్కల నీడలో నన్ను దాచండి.

10వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు,వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి.

11వారు నన్ను పసిగట్టి నన్ను చుట్టుముట్టారు,నన్ను నేలకూల్చాలని చూస్తున్నారు.

12వేట కోసం ఆకలిగొని ఉన్న సింహంలా,చాటున పొంచి ఉన్న కొదమసింహంలా వారు ఉన్నారు.

13యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి;మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి.

14ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండియెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి.మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు;వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు,మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు.

15నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను;నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]