1Since many have undertaken to compile an ordered account of what has been accomplished among us.OTSAఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్లారా చూసినవారు, వాక్య ఉపదేశకులు మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు. కాబట్టి నీకు బోధించబడిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నీవు తెలుసుకోవడానికి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేనే ఆరంభం నుండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశోధించాను కాబట్టి నేను కూడా మీ కోసం అన్నిటిని ఒక క్రమంలో వ్రాయాలని నిర్ణయించుకున్నాను, నెరవేర్చబడిన సంఘటనలన్నిటిని గురించి నేనే జాగ్రత్తగా పరిశోధించి, తద్వారా మీకు బోధించబడిన విషయాలు ఎంత ఖచ్చితమైనవో మీకు తెలుస్తుంది.
2Just as eyewitnesses from the beginning and servants of the word handed these accounts to us,OTSANot in this edition
3I too, having traced everything accurately from the start, decided to write it in order for you, most excellent Theophilus,OTSANot in this edition
4so that you may know the certainty of the things you have been taught.OTSANot in this edition
5In the days of Herod, king of Judea, a priest named Zechariah was in Abijah's priestly division. His wife Elizabeth descended from Aaron.OTSAయూదయదేశపు రాజైన హేరోదు రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు.
6They were both righteous before our Father, walking blamelessly in all his commandments and ordinances.OTSAవారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు.
7But they had no child, because Elizabeth was barren, and both were very old.OTSAఅయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.
8Now while he was serving as priest before our Father when his division was on duty,OTSAఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు,
9by priestly custom, lot chose him to enter his sanctuary and burn incense.OTSAయాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీట్లు వేసినప్పుడు, అతనికి ప్రభువు మందిరంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది.
10And the whole crowd of the people were praying outside at the hour of incense.OTSAధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు.
11Then an angel of our Father appeared to him, standing at the right of the altar of incense.OTSAప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు.
12Zechariah was shaken when he saw him, and fear came over him.OTSAజెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు.
13The angel said to him, "Don't be afraid, Zechariah—your prayer has been heard. Your wife Elizabeth will bear you a son; name him John.OTSAఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి.
14You will have joy and gladness; many will rejoice at his birth.OTSAఅతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగ చేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు.
15He will be great before our Father, must never drink wine or other alcoholic drinks, and he will be filled with the Holy Spirit even from his mother's womb.OTSAఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు.
16And he will turn many of the children of Israel back to their Father.OTSAఇశ్రాయేలీయుల్లోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు.
17He will go before our Father in Elijah's spirit and power, turning fathers' hearts to their children, and the disobedient to the wisdom of the righteous, to prepare a people ready for our Father."OTSAఅతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి, ప్రజలను ప్రభువు కోసం సిద్ధపరచడానికి ఏలీయా యొక్క ఆత్మతో శక్తితో ప్రభువుకు ముందుగా వెళ్తాడు” అన్నాడు.
18Zechariah said to the angel, "How will I know this? I'm old, and my wife is well along in years."OTSAఅందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు.
19The angel answered him, "I am Gabriel, who stands in our Father's presence, sent to speak to you and bring you this good news.OTSAఅందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను.
20And now you will be silent, unable to speak, until the day these things happen, because you did not believe my words, which will come true in their time."OTSAనేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు.
21Meanwhile the people waited for Zechariah, wondering why he stayed so long in the sanctuary.OTSAఅంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు.
22When he came out, he could not speak to them, and they knew he had seen a vision in the sanctuary. He kept motioning to them and stayed mute.OTSAఅతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు.
23And when his days of service were ended, he went home.OTSAఅతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు.
24After these days his wife Elizabeth became pregnant, and for five months she kept herself hidden, saying,OTSAఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది.
25"This is what our Father did for me, in the days he looked on me, to remove my disgrace among people."OTSAఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.
26In month six our Father sent the angel Gabriel to a Galilee town called Nazareth,OTSAఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి,
27to a virgin engaged to a man named Joseph, of the house of David; the virgin's name was Mary.OTSAదావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు.
28And he came to her and said, "Greetings, favored one! Our Father is with you."OTSAఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు.
29But she was greatly troubled by his words, and wondered what kind of greeting this might be.OTSAఅతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది.
30The angel said to her, "Don't be afraid, Mary, for you have found favor with our Father.OTSAఅయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు.
31You will conceive in your womb and bear a son, and you will call his name Jesus.OTSAనీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి.
32He will be great and called Son of the Most High, and our Father will give him the throne of his father David,OTSAఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు.
33and he will reign over Jacob's house forever; his kingdom will never end."OTSAఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.
34And Mary said to the angel, "How will this be, since I am a virgin?"OTSAమరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.
35The angel answered her, "The Holy Spirit will come over you, and the Most High's power will shadow you; so the holy child born will be called the Son of our Father.OTSAఅందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.
36Look, your relative Elizabeth has also conceived a son in her old age—this is the sixth month for her called barren.OTSAనీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది.
37For nothing will be impossible with our Father."OTSAఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు.
38Mary said, "I am the servant of our Father; let it happen to me as you said." Then the angel left her.OTSAఅందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.
39In those days Mary got up and hurried to the hill country, to a town in Judah,OTSAకొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది,
40and she entered the house of Zechariah and greeted Elizabeth.OTSAఅక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది.
41When Elizabeth heard Mary's greeting, her baby leaped in her womb, and she was filled with the Holy Spirit.OTSAఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది.
42She cried out with a loud voice, "Blessed are you among women, blessed is the fruit of your womb!OTSAఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు!
43And why is this granted to me, that the mother of my Lord should come to me?OTSAనా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను?
44For the moment I heard your greeting, the baby in my womb leaped for joy.OTSAనీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు.
45Blessed is she who believed that there would be a fulfillment of what our Father spoke to her."OTSAప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.
46And Mary said, "My soul magnifies our Father,OTSAఅందుకు మరియ: “నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.
47and my spirit rejoices in our Father, my Savior,OTSAనా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
48for he has looked on the humble estate of his servant. For from now on all generations will call me blessed;OTSAతన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,
49for the Mighty One has done great things for me, and holy is his name.OTSAఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు.
50And his mercy is for those who fear him from generation to generation.OTSAతరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది.
51He has shown strength with his arm; he has scattered the proud in the thoughts of their hearts;OTSAఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.
52he has brought down the mighty from their thrones and lifted up the humble;OTSAసింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు.
53he has filled the hungry with good things, and the rich he has sent away empty.OTSAఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
54He has helped his servant Israel, in remembrance of his mercy,OTSAఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”
55just as he spoke to our fathers, to Abraham and to his offspring forever."OTSANot in this edition
56And Mary remained with her about three months and then returned to her home.OTSAమరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.
57Now the time came for Elizabeth to give birth, and she bore a son.OTSAఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది.
58Her neighbors and relatives heard our Father had shown her great mercy, and rejoiced with her.OTSAప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు.
59On the eighth day they came to circumcise the child, and were going to call him Zechariah after his father,OTSAఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా,
60but his mother answered, "No; he will be called John."OTSAతల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది.
61And they said to her, "None of your relatives is called by this name."OTSAఅందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.
62And they made signs to his father, asking what Zechariah wanted the child to be called.OTSAవారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు.
63He asked for a tablet and wrote, "His name is John." And everyone was amazed.OTSAఅందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు.
64And immediately his mouth was opened and his tongue loosed, and he spoke, blessing our Father.OTSAవెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు.
65Fear fell on all their neighbors, and all these things were talked about throughout Judea's hill country.OTSAఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు.
66And all who heard kept these things in their hearts, saying, "What then will this child become?" For our Father's hand was with him.OTSAఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది.
67And his father Zechariah was filled with the Holy Spirit and prophesied, saying,OTSAతండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు:
68"Blessed be our Father of Israel, for he has visited and redeemed his people,OTSA“ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.
69and has raised up a mighty Savior for us in the house of his servant David,OTSAదేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.
70as he spoke through the mouth of his holy prophets long ago,OTSANot in this edition
71that we should be saved from our enemies and from the hand of all who hate us;OTSAమన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,
72to show the mercy promised to our fathers and to remember his holy covenant,OTSAమన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:
73the oath that he swore to our father Abraham, to grant us,OTSAమన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,
74that we, being delivered from the hand of our enemies, might serve him without fear,OTSAమన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని,
75in holiness and righteousness before him all our days.OTSAబ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు.
76And you, child, will be called the prophet of the Most High; for you will go before the Lord to prepare his ways,OTSA“నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు; ప్రభువుకు ముందుగా నీవు ఆయన కోసం మార్గం సిద్ధం చేస్తావు.
77to give his people the knowledge of salvation through the forgiveness of their sins,OTSAఆయన ప్రజలకు వారి పాపక్షమాపణ ద్వారానే, రక్షణ కలుగుతుందని వారికి తెలియ చేస్తావు,
78because of the tender mercy of our Father, by which the sunrise from on high will visit us,OTSAఎందుకంటే మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించడానికి, చీకటిలో జీవిస్తున్నవారిపై మరణచ్ఛాయలో ఉన్నవారిపై ప్రకాశించడానికి పరలోకం నుండి ఉదయించే సూర్యునిలా మన దేవుని దయా కనికరం మన కోసం అనుగ్రహించబడింది.”
79to give light to those who sit in darkness and in the shadow of death, to guide our feet into the way of peace."OTSANot in this edition
80The child grew, became strong in spirit, and lived in the wilderness until the day he appeared publicly to Israel.OTSAఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు.