Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 19 OTSA

Side by side with the Father's Heart Bible™

ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం

1ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం:చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కిఈజిప్టుకు వస్తున్నారు.ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి,ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి.

2“నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను,సోదరుని మీదికి సోదరుడు,పొరుగువారి మీదికి పొరుగువారు,పట్టణం మీదికి పట్టణం,రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను.

3ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు,వారి ఆలోచనలను నాశనం చేస్తాను;వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను,భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు.

4నేను ఈజిప్టువారినిక్రూరమైన అధికారి చేతికి అప్పగిస్తాను,భయంకరమైన రాజు వారిని పాలిస్తాడు” అనిసైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.

5సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి,నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.

6కాలువలు కంపుకొడతాయి;ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి.రెల్లు, గడ్డి వాడిపోతాయి,

7నైలు నది ప్రాంతంలోదాని ఒడ్డున ఉన్న మొక్కలు కూడా వాడిపోతాయి,నైలు తీరం వెంట ఉన్న ప్రతి పొలంవాడిపోయి దుమ్ములా కొట్టుకు పోయి ఇక కనబడవు.

8జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు,నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు;నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు.

9దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు,సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు.

10బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు,కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.

11సోయను అధిపతులు మూర్ఖులు తప్ప మరేమీ కాదు;ఫరో సలహాదారులు అర్థంలేని సలహాలు ఇస్తారు.“నేను జ్ఞానులలో ఒకడిని,పూర్వపురాజుల శిష్యుడను”అని ఫరోతో మీరెలా చెప్తారు?

12నీ జ్ఞానులు ఏమయ్యారు?సైన్యాల యెహోవాఈజిప్టు గురించి నిర్ణయించిన దానినివారు నీకు చూపించి, తెలియజేయనివ్వు.

13సోయను అధిపతులు మూర్ఖులయ్యారు,మెంఫిసు నాయకులు మోసపోయారు.ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారుదానిని దారి తప్పేలా చేశారు.

14యెహోవా వారి మీదభ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు;ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు,తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.

15తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గానిఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.

16ఆ రోజున ఈజిప్టువారు స్త్రీలలా బలహీనంగా అవుతారు. సైన్యాల యెహోవా వారిపై తన చేయి ఆడించడం చూసి వారు భయంతో వణికిపోతారు. 17యూదా దేశం ఈజిప్టువారికి భయం కలిగిస్తుంది; తమకు వ్యతిరేకంగా సైన్యాల యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి యూదా గురించి విన్న ప్రతి ఒక్కరు భయపడతారు.

18ఆ రోజున ఈజిప్టులో ఉండే అయిదు పట్టణాలు కనాను భాష మాట్లాడి, సైన్యాల యెహోవా వారమని ప్రమాణం చేస్తాయి. వాటిలో ఒకదాని పేరు సూర్యుని పట్టణము.

19ఆ రోజున ఈజిప్టు దేశంలో మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం, దాని సరిహద్దులో యెహోవాకు ఒక స్మారక చిహ్నం ఉంటాయి. 20అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు. 21ఈజిప్టువారికి యెహోవా తనను తాను బయలుపరచుకుంటారు; ఆ రోజున వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలులు, భోజనార్పణలు సమర్పించి ఆయనను ఆరాధిస్తారు. వారు యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లిస్తారు. 22యెహోవా ఈజిప్టును తెగులుతో బాధిస్తారు; వారిని బాధించి వారిని స్వస్థపరుస్తారు. వారు యెహోవా వైపు తిరుగుతారు, ఆయన వారి విన్నపాలు విని వారిని స్వస్థపరుస్తారు.

23ఆ రోజున ఈజిప్టు నుండి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరీయులు ఈజిప్టుకు, ఈజిప్టువారు అష్షూరుకు వస్తూ పోతుంటారు. ఈజిప్టువారు అష్షూరీయులు కలిసి ఆరాధిస్తారు. 24ఆ రోజున, ఈజిప్టు అష్షూరుతో పాటు ఇశ్రాయేలు మూడవదిగా ఉండి, భూమిపై ఆశీర్వాదంగా ఉంటుంది. 25సైన్యాల యెహోవా, “నా ప్రజలైన ఈజిప్టు వారలారా, నా చేతి పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా! మీరు ఆశీర్వదింపబడతారు” అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]