Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 10 OTSA

Side by side with the Father's Heart Bible™

1అన్యాయపు చట్టాలు చేసేవారికి,చెడు శాసనాలు చేసేవారికి శ్రమ.

2వారు పేదల హక్కులను హరిస్తారు,నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరువారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూతండ్రిలేనివారిని దోచుకుంటారు.

3తీర్పు తీర్చే రోజున,దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు?సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు?మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు?

4బంధించబడిన వారి మధ్య మోకరిల్లడంచనిపోయినవారి మధ్య పడిపోవడం తప్ప మరేమీ మిగలదు.ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదుఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.

అష్షూరుపై దేవుని తీర్పు

5అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండంనా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది.

6దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను,దోచుకోడానికి కొల్లగొట్టడానికి,వీధుల్లో మట్టిలా వారిని త్రొక్కడానికినాకు కోపం కలిగించిన ప్రజల గురించి అతన్ని ఆజ్ఞాపిస్తాను.

7అయితే ఇది అతడు ఉద్దేశించింది కాదు,ఇది అతని మనస్సులో ఉన్నది అది కాదు.నాశనం చేయాలని,చాలా దేశాలను నిర్మూలించాలన్నది అతని ఉద్దేశము.

8అతడు, “నా అధిపతులందరు రాజులు కారా?

9కల్నో, కర్కెమీషులా ఉండలేదా?హమాతు అర్పదులా ఉండలేదాసమరయ దమస్కులా ఉండలేదా?

10విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు,వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి.

11నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లుయెరూషలేముకు దాని విగ్రహాలకు చేయవద్దా?”

12ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను. 13ఎందుకంటే అతడు ఇలా అన్నాడు:“ ‘నేను వివేకిని, నా బాహుబలం చేత,నా జ్ఞానంతో దీన్ని చేశాను.నేను ప్రజల సరిహద్దులు తీసివేశాను,వారి సంపదలు దోచుకున్నాను;బలవంతునిలా వారి రాజులను అణచివేశాను.

14పక్షి గూటిలోనికి చేరునట్లునా చేయి దేశాల సంపదను చేరుకుంది;ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా,నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను;ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదాకిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ”

15గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా,రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా?కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లుదుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!

16కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా,అష్షూరీయుల బలమైన వీరుల మీదికి పాడుచేసే రోగాన్ని పంపుతారు;వారి మహిమను కాల్చడానికివారి క్రింద మండుతున్న జ్వాలల వంటి అగ్ని మండుతుంది.

17ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది,వారి పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలగా మారుతారు;అతని ముళ్ళచెట్లను, గచ్చపొదలనుఒక రోజులోనే వాటిని కాల్చి, దహించివేస్తుంది.

18ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లుఅతని అడవికి, సారవంతమైన పొలాలకు ఉన్న వైభవాన్నిఅది పూర్తిగా నాశనం చేస్తుంది.

19అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయిపిల్లవాడు కూడా వాటిని లెక్కపెట్టవచ్చు.

ఇశ్రాయేలులో మిగిలినవారు

20ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారుయాకోబు కుటుంబంలో తప్పించుకున్నవారుతమను మొత్తిన వానినిఇక ఆశ్రయించరుకాని ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవానువారు నిజంగా ఆశ్రయిస్తారు.

21మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారుబలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు.

22నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా,వారిలో మిగిలినవారే తిరుగుతారు.నాశనం శాసించబడిందినీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది.

23ప్రభువు, సైన్యాల యెహోవాభూమి అంతటా నిర్ణయించబడిన నాశనాన్ని కలుగజేస్తారు.

24కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది:“సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా,ఈజిప్టులో చేసినట్టు కర్రతో మిమ్మల్ని కొట్టిమీమీద తన దుడ్డుకర్ర ఎత్తినఅష్షూరీయులకు భయపడకండి.

25అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుందినా ఉగ్రత వారి నాశనానికి దారి తీస్తుంది.”

26ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లుసైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు;ఆయన ఈజిప్టులో చేసినట్టుతన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు.

27ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది,మీ మెడపై నుండి వారి కాడి కొట్టివేయబడుతుంది.మీరు బలంగా ఉన్నందుకుఆ కాడి విరిగిపోతుంది.

28అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు;మిగ్రోను గుండా వెళ్లారు;మిక్మషులో తమ సామాను ఉంచారు.

29వారు మార్గం దాటి వెళ్తూ,“మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు.రామా వణకుతుంది;సౌలు గిబియా పారిపోతుంది.

30గల్లీము కుమార్తె! కేకలు వేయిలాయిషా, విను!అయ్యయ్యో, అనాతోతు!

31మద్మేనా ప్రజలు పారిపోతారు.గెబీము నివాసులు దాక్కుంటారు.

32ఈ రోజే వారు నోబులో దిగుతారు;ఈ రోజే సీయోను కుమారి పర్వతం,యెరూషలేము కొండ వైపువారు తమ పిడికిలి ఆడిస్తారు.

33చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవామహాబలంతో కొమ్మలు నరుకుతారు.ఉన్నతమైన చెట్లు నరకబడతాయి,ఎత్తైనవి పడగొట్టబడతాయి.

34ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు;బలవంతుని ఎదుట లెబానోను పడిపోతుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]