Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Exodus 15 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Moses and the Israelites sang this song to our Father: I will sing to our Father, for he has triumphed gloriously; the horse and its rider he hurled into the sea. దాని తర్వాత మోషే ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు: “నేను యెహోవాకు పాడతాను, ఆయన ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశారు.
2 Our Father is my strength and my song, and he has become my salvation; this is my Father, and I will praise him, the God of my father, and I will exalt him. “యెహోవాయే నా బలము నా పాట; ఆయన నాకు రక్షణ అయ్యారు. ఆయన నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన నా తండ్రికి దేవుడు నేనాయనను మహిమపరుస్తాను.
3 Our Father is a warrior; our Father is his name. యెహోవా యుద్ధవీరుడు; యెహోవా అని ఆయనకు పేరు.
4 Pharaoh's chariots and his army he cast into the sea, and his chosen officers were drowned in the Red Sea. ఆయన ఫరో రథాలను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేసారు. అతని అధిపతులలో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5 The deep waters covered them; they went down into the depths like a stone. అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు.
6 Your right hand, our Father, is majestic in power; your right hand, our Father, shatters the enemy. యెహోవా, మీ కుడిచేయి, బలంలో మహిమగలది. యెహోవా, మీ కుడిచేయి, శత్రువును పడగొట్టింది.
7 In the greatness of your majesty you overthrow those who rise against you; you send out your burning anger; it consumes them like stubble. “మీకు వ్యతిరేకంగా లేచినవారిని మీ మహిమాతిశయంతో అణచివేశారు. మీరు మీ కోపాగ్నిని రగిలించారు అది వారిని చెత్తలా దహించింది.
8 At the blast of your nostrils the waters piled up; the flowing waters stood up in a heap; the deep waters solidified in the heart of the sea. మీ ముక్కు నుండి వచ్చిన ఊపిరివలన నీళ్లు కుప్పగా నిలిచాయి. ప్రవాహజలాలు గోడలా నిలబడ్డాయి; అగాధజలాలు సముద్రం మధ్యలో గడ్డకట్టాయి.
9 The enemy said, "I will pursue, I will overtake, I will divide the spoil; I will have my fill of them. I will draw my sword; my hand is to destroy them." ‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.
10 You blew with your wind; the sea covered them; they sank like lead in the mighty waters. అయితే మీరు మీ శ్వాసను ఊదగా సముద్రం వారిని కప్పేసింది. వారు బలమైన జలాల క్రింద సీసంలా మునిగిపోయారు.
11 Who is like you among the gods, our Father? Who is like you, majestic in holiness, awesome in glorious deeds, doing wonders? యెహోవా, దేవుళ్ళ మధ్యలో మీవంటి వారెవరు? పరిశుద్ధతలో ఘనమైనవారు మహిమలో భీకరమైనవారు, అద్భుతాలు చేసే మీవంటి వారెవరు?
12 You stretched out your right hand; the earth swallowed them. “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది.
13 In your covenant love you have led the people whom you have redeemed; you have guided them by your strength to your holy dwelling. మీరు విమోచించిన ప్రజలను మారని మీ ప్రేమతో నడిపిస్తారు. మీ బలంతో మీరు వారిని మీ పరిశుద్ధాలయానికి నడిపిస్తారు.
14 The peoples have heard; they tremble; anguish has seized the people of Philistia. దేశాలు విని వణుకుతాయి; ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది.
15 Now the chiefs of Edom are dismayed; trembling seizes the leaders of Moab; all the inhabitants of Canaan have melted away. ఎదోము పెద్దలు భయపడతారు, మోయాబు నాయకులకు వణుకు పుడుతుంది. కనాను ప్రజలు భయంతో నీరైపోతారు;
16 Terror and dread fall upon them; because of the greatness of your arm they are still as a stone, till your people pass by, our Father, till the people pass by whom you have purchased. భయం దిగులు వారి మీద పడతాయి. యెహోవా, మీ ప్రజలు దాటి వెళ్లేవరకు, మీరు కొనిన మీ ప్రజలు దాటి వెళ్లేవరకు మీ బాహుబలము చేత వారు రాతిలా కదలకుండా ఉంటారు.
17 You will bring them in and plant them on the mountain of your inheritance, the place, our Father, that you have made for your dwelling, the sanctuary, Sovereign Father, that your hands have established. మీరు వారిని లోపలికి తెచ్చి మీ స్వాస్థ్యమైన పర్వతం మీద యెహోవా, మీరు నివసించడానికి నిర్మించుకున్న స్థలంలో, ప్రభువా, మీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో నాటుతారు.
18 Our Father will reign forever and ever. “యెహోవా నిరంతరం పరిపాలిస్తారు.”
19 When Pharaoh's horses, chariots, and horsemen went into the sea, our Father brought the sea's waters back over them—but Israel walked through the sea on dry ground. ఫరో గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు సముద్రంలోకి వచ్చినప్పుడు, యెహోవా వారి మీదికి సముద్రపు నీటిని రప్పించారు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచారు.
20 Miriam the prophet, Aaron's sister, took a tambourine in her hand, and all the women followed her with tambourines, dancing. అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు.
21 Miriam sang to them: "Sing to our Father—he has won gloriously; horse and rider he hurled into the sea." మిర్యాము వారితో ఇలా పాడింది: “యెహోవాకు పాడండి, ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో విసిరిపడవేశారు.”
22 Moses led Israel from the Red Sea into the wilderness of Shur; three days they traveled in that wilderness without finding water. తర్వాత మోషే ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించగా వారు షూరు ఎడారిలోనికి వెళ్లి మూడు రోజులు దానిలో ప్రయాణం చేశారు. అక్కడ వారికి నీరు దొరకలేదు.
23 They came to Marah but couldn't drink the water—it was bitter. So it was named Marah. అప్పుడు వారు మారాకు వచ్చారు. అయితే మారా నీళ్లు చేదుగా ఉండడంతో వారు ఆ నీటిని త్రాగలేకపోయారు. (అందువల్ల ఆ చోటికి మారా అనే పేరు వచ్చింది.)
24 And the people grumbled against Moses, saying, "What should we drink?" కాబట్టి ప్రజలు, “మేమేమి త్రాగాలి?” అని మోషే మీద సణిగారు.
25 He cried to our Father, who showed him a piece of wood; he threw it into the water, and it turned sweet. There our Father set them a statute and rule, and tested them there. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టు కొమ్మను చూపించారు. అతడు దానిని నీటిలో వేయగా ఆ నీరు తియ్యగా మారాయి. అక్కడే యెహోవా వారికి ఒక శాసనాన్ని నియమించి వారిని పరీక్షించారు.
26 He said, "If you truly listen to the voice of your Father, do right in his eyes, heed his commands, and keep all his statutes, I will put none of the diseases on you that I put on Egypt, for I am your Father who heals you." ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.
27 They came to Elim, where twelve springs of water and seventy palm trees stood, and they camped there beside the water. తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై తాటి చెట్లు ఉన్నాయి. వారు ఆ నీటి దగ్గరే బస చేశారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]