Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Deuteronomy 14 OTSA

Show OTSA only
Verse × ×
1 You are children of your Father—don't cut yourselves or shave your forehead bald for the dead. మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు. చనిపోయినవారి కోసం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య క్షవరం చేసుకోకూడదు,
2 For you are a holy people, belonging to your Father—your Father chose you to be his treasured possession out of all the peoples on the face of the earth. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు పవిత్ర ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో యెహోవా మిమ్మల్ని తన విలువైన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు.
3 You shall not eat anything detestable. అసహ్యమైనదేది తినకూడదు.
4 These are the animals you may eat: the ox, the sheep, and the goat, మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,
5 deer, gazelle, roe deer, wild goat, ibex, antelope, and mountain sheep. జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు,
6 You may eat any animal that has a completely divided hoof and that chews the cud. చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.
7 But among those that chew the cud or have a split hoof, you may not eat the camel, the hare, or the rock badger—they chew the cud but their hoof isn't split; they are unclean for you. అయితే, నెమరువేసే జంతువు లేదా చీలిన డెక్కలు కలిగి ఉన్న ఒంటెలు, కుందేలు, పొట్టి కుందేలు లాంటివి మీరు తినకూడదు. అవి నెమరువేసేవైనా వాటికి చీలిన డెక్కలు లేవు; అవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.
8 The pig has a split hoof but doesn't chew the cud, so it is unclean for you. Don't eat their meat or touch their carcasses. పంది కూడా అపవిత్రమైనది; దానికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు.
9 Of all that live in the water, you may eat anything that has fins and scales. నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.
10 But anything without fins and scales you must not eat—it is unclean for you. రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.
11 You may eat any clean bird. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు.
12 But these are the ones you shall not eat: the eagle, the vulture, the black vulture, కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
13 the kite, the falcon, the buzzard of any kind, ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,
14 every raven of any kind, ప్రతి రకమైన కాకి,
15 the ostrich, the nighthawk, the seagull, the hawk of any kind, కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
16 the little owl, the great owl, the white owl, పైడికంటే, గుడ్లగూబ, హంస,
17 the desert owl, the scavenger bird, the cormorant, గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,
18 the stork, the heron of any kind, the hoopoe, and the bat. సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
19 All winged insects are unclean for you; do not eat them. ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.
20 But any clean winged creature you may eat. ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.
21 Do not eat anything that died on its own. You may give it to the stranger in your towns to eat, or sell it to a foreigner—you are a holy people to your Father. Do not boil a young goat in its mother's milk. మీరు ముందే కనుగొన్న చచ్చినదానిని తినకూడదు. మీ పట్టణాల్లో నివసించే విదేశీయులకు మీరు దానిని ఇవ్వవచ్చు, వారు దానిని తినవచ్చు లేదా ఇతర విదేశీయులకు దానిని అమ్మవచ్చు. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజలు. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
22 Bring the tenth of all your field's yearly produce, without fail. ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి.
23 Eat before your Father, in the place he chooses to make his name live there: the tenth of your grain, new wine, and oil, and the firstborn of your herd and flock—so you learn to always revere your Father. మీ దేవుడైన యెహోవాకు మీరు ఎల్లప్పుడు భయపడడం నేర్చుకునేలా మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, పశువుల్లో, మందలలో మొదటి పిల్లల్లో పదవ దానిని యెహోవా సన్నిధిలో తినాలి.
24 But if the journey is too long for you to carry the tenth—since the place your Father chooses for his name is too far from you—once your Father has blessed you, ఒకవేళ ఆ స్థలం అంటే యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినందున మీ దశమభాగాన్ని అక్కడికి మోసుకొని వెళ్లలేనప్పుడు,
25 turn it into money, carry it with you, and go to the place your Father will choose. మీ దశమభాగాన్ని వెండికి మార్చి, దానిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకురావాలి.
26 Spend the money on whatever you crave—cattle, sheep, wine, or strong drink, whatever you desire—eat there before your Father, rejoice, you and your household. ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.
27 Do not abandon the Levite in your towns, since he has no portion or inheritance with you. మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే వారికి మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేదు.
28 At the end of every three years, bring out the full tenth of that year's produce and store it in your towns. మీ దేవుడైన యెహోవా మీ చేతిపనిని ఆశీర్వదించేలా, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఆ సంవత్సరం పండిన పంటలో దశమభాగాన్ని తెచ్చి మీ పట్టణాల్లో నిలువచేయాలి, తద్వార మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేని లేవీయులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తిపొందుతారు.
29 The Levite—since he has no portion or inheritance with you—and the foreigner, orphan, and widow in your towns are to come, eat, and be satisfied, so that your Father may bless you in all your hands' work. Not in this edition
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]