Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 7 OTSA

Side by side with the Father's Heart Bible™

ఇశ్శాఖారు

1ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యాషూబు, షిమ్రోను మొత్తం నలుగురు.

2తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.

3ఉజ్జీ కుమారుడు: ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు: మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. ఈ అయిదుగురు పెద్దలు.

4వారికి చాలామంది భార్యలు, పిల్లలు ఉండడం వల్ల వారి వంశావళి ప్రకారం వారిలో యుద్ధవీరుల సంఖ్య 36,000.

5ఇశ్శాఖారు వంశాలన్నిటికి చెందిన వీరి బంధువుల నుండి వారి వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 87,000.

బెన్యామీను

6బెన్యామీనుకు కుమారులు ముగ్గురు: బేల, బెకెరు, యెదీయవేలు.

7బేల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ మొత్తం అయిదుగురు. వీరు కుటుంబ పెద్దలు. తమ వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 22,034.

8బెకెరు కుమారులు: జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరు బెకెరు కుమారులు.

9తమ వంశావళి ప్రకారం వీరు కుటుంబ పెద్దలు; యుద్ధవీరుల సంఖ్య 20,200.

10యెదీయవేలు కుమారుడు: బిల్హాను. బిల్హాను కుమారులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.

11యెదీయవేలు కుమారులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు. వీరిలో యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యుద్ధవీరుల సంఖ్య 17,200.

12ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు.

నఫ్తాలి

13నఫ్తాలీయులైన బిల్హా వారసులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.

మనష్షే

14మనష్షే వారసులు: అరాము దేశస్థురాలైన ఉంపుడుగత్తె ద్వారా అశ్రీయేలు అతనికి వారసుడు అయ్యాడు.ఆమె గిలాదు తండ్రియైన మాకీరుకు జన్మనిచ్చింది.

15మాకీరు షుప్పీము, హుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. వారి సోదరి పేరు మయకా. మరో వారసుని పేరు సెలోఫెహాదు. అతనికి కుమార్తెలు మాత్రమే పుట్టారు. 16మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అనే పేరు పెట్టింది. అతని తమ్ముని పేరు షెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము.

17ఊలాము కుమారుడు: బెదాను. వీరు మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారులు.

18మాకీరు సోదరి హమ్మోలెకెతుకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.

19షెమీదా కుమారులు: అహెయాను, షెకెము, లికీ, అనీయాము.

ఎఫ్రాయిం

20ఎఫ్రాయిం వారసులు: ఎఫ్రాయిం కుమారుడు షూతలహు, అతని కుమారుడు బెరెదు, అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఎల్యాదా, అతని కుమారుడు తాహతు,

21అతని కుమారుడు జాబాదు, అతని కుమారుడు షూతలహు. (అతని కుమారులైన ఏజెరు ఎల్యాదులు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకోడానికి వెళ్లినప్పుడు, గాతీయులు వారిని చంపారు.

22వారి తండ్రియైన ఎఫ్రాయిం చాలా రోజులు దుఃఖపడ్డాడు, అతని బంధువులు వచ్చి అతన్ని ఓదార్చారు. 23ఆ తర్వాత అతడు తన భార్యను కలుసుకోగా ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. తన కుటుంబంలో జరిగిన కీడును బట్టి ఎఫ్రాయిం అతనికి బెరీయా అనే పేరు పెట్టాడు. 24అతని కుమార్తెయైన షెయెరా దిగువ బేత్-హోరోను, ఎగువ బేత్-హోరోను, ఉజ్జెన్-షెయెరా అనే పట్టణాలను కట్టించింది.)

25ఎఫ్రాయిం కుమారుడు రెపహు, అతని కుమారుడు రెషెపు, అతని కుమారుడు తెలహు, అతని కుమారుడు తహను,

26అతని కుమారుడు లద్దాను, అతని కుమారుడు అమీహూదు, అతని కుమారుడు ఎలీషామా,

27అతని కుమారుడు నూను, అతని కుమారుడు యెహోషువ.

28వారి ప్రదేశాలు నివాసస్థలాలు ఏవంటే, బేతేలు దాని చుట్టుప్రక్కల గ్రామాలు, తూర్పున ఉన్న నహరాను, పడమర ఉన్న గెజెరు దాని గ్రామాలు, షెకెము దాని గ్రామాలు, అయ్యా దాని గ్రామాల వరకు ఉన్న ప్రాంతాలు. 29మనష్షే సరిహద్దులలో ఉన్న బేత్-షాను, తానాకు, మెగిద్దో, దోరు, వాటి గ్రామాలతో పాటు వారివే. ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు వారసులు ఈ పట్టణాల్లో నివసించారు.

ఆషేరు

30ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు.

31బెరీయా కుమారులు: హెబెరు, బిర్జాయీతు తండ్రియైన మల్కీయేలు.

32హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి.

33యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు. వీరు యప్లేటు కుమారులు.

34షోమేరు కుమారులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాము.

35అతని సోదరుడైన హేలెము కుమారులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.

36జోపహు కుమారులు: సూయ, హర్నెఫెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,

37బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేర.

38ఎతెరు కుమారులు: యెఫున్నె, పిస్పా, అరా.

39ఉల్లా కుమారులు: ఆరహు హన్నియేలు రిజెయా

40ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]