Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 5 OTSA

Show OTSA only
Verse × ×
1 The sons of Reuben, Israel's firstborn—he was indeed the firstborn, but since he violated his father's bed, his birthright went to the sons of Joseph son of Israel, so he could not be listed as the firstborn in the genealogy. ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.
2 Though Judah grew strong among his brothers and a ruler came from him, the birthright was Joseph's. యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.)
3 The sons of Reuben the firstborn of Israel: Hanoch, Pallu, Hezron, and Carmi. ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
4 The sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son, యోవేలు సంతానం: అతని కుమారుడు షెమయా, అతని కుమారుడు గోగు, అతని కుమారుడు షిమీ,
5 Micah his son, Reaiah his son, Baal his son, అతని కుమారుడు మీకా, అతని కుమారుడు రెవాయా, అతని కుమారుడు బయలు,
6 and Beerah his son, whom Tiglath-pileser king of Assyria exiled—he led the Reubenites. అతని కుమారుడు బెయేర, ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు బందీగా తీసుకెళ్లాడు. బెయేర రూబేనీయులకు నాయకుడు.
7 His relatives by their clans, as listed in the genealogical records: Jeiel the chief, Zechariah, వారి వంశావళిలో పేర్కొన్న కుటుంబాల ప్రకారం వారి బంధువులు: నాయకుడైన యెహీయేలు, జెకర్యా,
8 and Bela son of Azaz, son of Shema, son of Joel. They settled in Aroer, to Nebo and Baal-meon. యోవేలు కుమారుడైన షెమ కుమారుడైన ఆజాజు కుమారుడైన బేల. వారు అరోయేరు నుండి నెబో వరకు, బయల్-మెయోను వరకు నివసించారు.
9 They also settled eastward to the edge of the desert that stretches to the Euphrates, since their livestock had multiplied in Gilead. వారి పశువులు గిలాదులో విస్తారంగా వృద్ధిచెందడంతో, తూర్పున యూఫ్రటీసు నది దగ్గర నుండి ఎడారి సరిహద్దు వరకు వారు నివసించారు.
10 In Saul's days they fought the Hagrites, who fell to them; they lived in the Hagrites' tents across the whole region east of Gilead. సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.
11 The sons of Gad lived next to them in the land of Bashan as far as Salcah: గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు.
12 Joel the chief, Shapham the second-in-command, then Janai and Shaphat in Bashan. వారికి యోవేలు నాయకుడు. అతని తర్వాత షాపాము, తర్వాత యహనై, షాపాతు, వీరు బాషానులో ఉండేవారు.
13 Their relatives, by their fathers' households, were Michael, Meshullam, Sheba, Jorai, Jacan, Zia, and Eber—seven. వారి కుటుంబాల ప్రకారం వారి బంధువులు: మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ, ఏబెరు మొత్తం ఏడుగురు.
14 These were sons of Abihail son of Huri, son of Jaroah, son of Gilead, son of Michael, son of Jeshishai, son of Jahdo, son of Buz. వీరు హూరీ కుమారుడైన అబీహయిలు కుమారులు: హూరీ యరోయ కుమారుడు, యరోయ గిలాదు కుమారుడు, గిలాదు మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు యెషీషై కుమారుడు, యెషీషై యహదో కుమారుడు, యహదో బూజు కుమారుడు.
15 Ahi son of Abdiel, son of Guni, was the head of their fathers' households. గూనీ కుమారుడైన అబ్దీయేలుకు పుట్టిన అహీ వారి కుటుంబ పెద్ద.
16 They lived in Gilead, in Bashan and its villages, and across all Sharon's pasturelands to their borders. గాదు వంశస్థులు బాషానులో గిలాదులో, చుట్టుప్రక్కల గ్రామాల్లో, షారోను సరిహద్దుల వరకు ఉన్న పచ్చని మైదానాల్లో నివసించారు.
17 All these were listed in genealogies during the reigns of Jotham king of Judah and Jeroboam king of Israel. వీరందరు యూదా రాజైన యోతాము రోజుల్లో ఇశ్రాయేలు రాజైన యరొబాము రోజుల్లో వంశావళి పత్రాలలో నమోదయ్యారు.
18 The Reubenites, Gadites, and half-tribe of Manasseh had capable men bearing shield and sword, drawing the bow, trained for war—44,760 ready for battle. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారిలో డాలు కత్తి పట్టుకోవడంలో నేర్పుగలవారు, విల్లు ఉపయోగించగలవారు, యుద్ధశిక్షణ తీసుకున్నవారు 44,760 మంది ఉన్నారు.
19 They waged war against the Hagrites, and against Jetur, Naphish, and Nodab. వారు హగ్రీయీలతో, యెతూరువారితో, నాపీషువారితో, నోదాబువారితో యుద్ధం చేశారు.
20 They were helped against them; the Hagrites and all their allies were given into their hand, because they cried out to our Father in battle. He answered them, for they trusted in him. వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఆ హగ్రీయీలను, వారితో ఉన్నవారందరిని వారి చేతికి అప్పగించారు. వారు ఆయన మీద నమ్మకముంచారు కాబట్టి ఆయన వారి ప్రార్థన అంగీకరించారు.
21 They captured the Hagrites' livestock: 50,000 camels, 250,000 sheep, 2,000 donkeys, and 100,000 people. వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.
22 Many fell dead, for the battle was our Father's; they lived there until the exile. ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు.
23 Manasseh's half-tribe lived in the land, growing numerous from Bashan to Baal-hermon, Senir, and Mount Hermon. మనష్షే అర్థగోత్రీకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు; వారు బాషాను నుండి, బయల్-హెర్మోను వరకు, అంటే శెనీరు వరకు (హెర్మోను పర్వతం) నివసించారు.
24 Heads of their fathers' households: Epher, Ishi, Eliel, Azriel, Jeremiah, Hodaviah, and Jahdiel—mighty warriors, famous men, heads of their fathers' households. వారి కుటుంబ పెద్దలు వీరే: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు. వీరు ధైర్యవంతులైన వీరులు, ప్రసిద్ధి చెందినవారు వారి కుటుంబ పెద్దలు.
25 But they were unfaithful to their ancestors' God and prostituted themselves to the gods of the land's peoples, whom our Father had destroyed before them. అయితే వారు తమ పూర్వికుల దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు, దేవుడు తమ ఎదుట నాశనం చేసిన దేశ ప్రజల దేవుళ్ళను పూజిస్తూ, వాటితో వ్యభిచారులగా ప్రవర్తించారు.
26 So our Father of Israel stirred up the spirit of Pul king of Assyria—Tiglath-pileser king of Assyria—and he exiled the Reubenites, Gadites, and half-tribe of Manasseh to Halah, Habor, Hara, and the river Gozan, where they remain to this day. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]