Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 25 OTSA

Show OTSA only
Verse × ×
1 David and the army commanders set apart some of the sons of Asaph, Heman, and Jeduthun for service, who prophesied with lyres, harps, and cymbals. Their numbers, by task, were: దావీదు, తన సైన్యాధిపతులతో కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సితారాలు, వీణలు, తాళాలు వాయిస్తూ ప్రవచించే పరిచర్య కోసం నియమించారు. ఈ సేవకు నియమించబడినవారి జాబితా ఇది:
2 Sons of Asaph: Zaccur, Joseph, Nethaniah, Asharelah, the sons of Asaph—under Asaph's direction, prophesying under the king's direction. ఆసాపు కుమారుల నుండి: జక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలా. వీరు రాజు పర్యవేక్షణలో ప్రవచిస్తూ, ఆసాపు పర్యవేక్షణలో ఉన్న ఆసాపు కుమారులు.
3 Jeduthun's sons: Gedaliah, Zeri, Jeshaiah, Shimei, Hashabiah, Mattithiah—six, guided by their father Jeduthun, prophesied with the lyre, thanking and praising our Father. యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.
4 Of Heman, sons of Heman: Bukkiah, Mattaniah, Uzziel, Shebuel, Jerimoth, Hananiah, Hanani, Eliathah, Giddalti, Romamti-ezer, Joshbekashah, Mallothi, Hothir, Mahazioth. హేమాను కుమారుల నుండి: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు.
5 All these were sons of Heman, the king's seer, given through our Father's word to lift Heman up. Our Father gave Heman fourteen sons and three daughters. (వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)
6 All these were under their father's direction for song in the house of our Father, with cymbals, harps, and lyres for the service of the house of our Father; Asaph, Jeduthun, and Heman were under the king's direction. వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు. ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు.
7 Their number, with their kin trained to sing to our Father—all skilled—was 288. యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288.
8 And they cast lots for their duties, small and great alike, teacher and pupil alike. చిన్నా, పెద్దా, గురువు శిష్యుడు అనే భేదం లేకుండా చీట్లు వేసి విధులు నిర్ణయించుకున్నారు.
9 The first lot came out for Asaph, to Joseph; the second, Gedaliah with his brothers and sons, twelve. మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరిట వచ్చింది, రెండవది గెదల్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
10 The third to Zaccur, his sons and his brothers, twelve; మూడవది జక్కూరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
11 the fourth to Izri, his sons and his brothers, twelve; నాలుగవది యిజ్రీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
12 the fifth to Nethaniah, his sons and his brothers, twelve; అయిదవది నెతన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
13 the sixth to Bukkiah, his sons and his brothers, twelve; ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
14 the seventh to Jesarelah, his sons and his brothers, twelve; ఏడవది యెషర్యేలా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
15 the eighth to Jeshaiah, his sons and his brothers, twelve; ఎనిమిదవది యెషయా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
16 the ninth to Mattaniah, his sons and his brothers, twelve; తొమ్మిదవది మత్తన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
17 the tenth to Shimei, his sons and his brothers, twelve; పదవది షిమీ పేరట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
18 the eleventh to Azarel, his sons and his brothers, twelve; పదకొండవది అజరేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
19 the twelfth to Hashabiah, his sons and his brothers, twelve; పన్నెండవది హషబ్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
20 the thirteenth to Shubael, his sons and his brothers, twelve; పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
21 the fourteenth to Mattithiah, his sons and his brothers, twelve; పద్నాలుగవది మత్తిత్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
22 the fifteenth to Jeremoth, his sons and his brothers, twelve; పదిహేనవది యెరేమోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
23 the sixteenth to Hananiah, his sons and his brothers, twelve; పదహారవది హనన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
24 the seventeenth to Joshbekashah, his sons and his brothers, twelve; పదిహేడవది యొష్బెకాషా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
25 the eighteenth to Hanani, his sons and his brothers, twelve; పద్దెనిమిదవది హనానీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
26 the nineteenth to Mallothi, his sons and his brothers, twelve; పందొమ్మిదవది మల్లోతి పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
27 the twentieth to Eliathah, his sons and his brothers, twelve; ఇరవయ్యవది ఎలీయాతా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
28 the twenty-first to Hothir, his sons and his brothers, twelve; ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
29 the twenty-second to Giddalti, his sons and his brothers, twelve; ఇరవై రెండవది గిద్దల్తీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
30 the twenty-third to Mahazioth, his sons and his brothers, twelve; ఇరవై మూడవది మహజీయోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
31 the twenty-fourth to Romamti-ezer, his sons and his brothers, twelve. ఇరవై నాలుగవది రోమమ్తీ-యెజెరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]