Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 Chronicles 24 OTSA

Show OTSA only
Verse × ×
1 These are the divisions of Aaron's sons. Aaron's sons: Nadab and Abihu, Eleazar and Ithamar. ఇవి అహరోను వారసుల విభాగాలు: అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
2 Nadab and Abihu died before their father, leaving no sons; so Eleazar and Ithamar served as priests. నాదాబు, అబీహు కుమారులు లేకుండానే తమ తండ్రి కంటే ముందే చనిపోయారు; కాబట్టి ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.
3 David divided them with Zadok, Eleazar's descendant, and Ahimelech, Ithamar's descendant, by their appointed service order. ఎలియాజరు వారసుడైన సాదోకు, ఈతామారు వారసుడైన అహీమెలెకు సహాయంతో, వారికి నియమించబడిన సేవా క్రమంలో, దావీదు వారిని విభాగించాడు.
4 Eleazar's sons were found to have more leaders than Ithamar's, so they were divided: sixteen family heads for Eleazar's, eight for Ithamar's, by their families. ఈతామారు వారసులలో కంటే ఎలియాజరు వారసులలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం ఎలియాజరు వారసులలో పదహారుగురు కుటుంబ పెద్దలు, ఈతామారు వారసులలో ఎనిమిది మంది కుటుంబ పెద్దలుగా నియమించబడ్డారు.
5 They divided them by lot, both alike, since officials of the sanctuary and officials of our Father came from the sons of Eleazar and the sons of Ithamar. ఎలియాజరు వారసులలో, ఈతామారు వారసులలో పరిశుద్ధాలయ అధికారులుగా, దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి, పక్షపాతం లేకుండా చీట్లు వేసి వారిని విభాగించారు.
6 Shemaiah son of Nethanel, a Levite scribe, wrote them before the king, the officials, Zadok the priest, Ahimelech son of Abiathar, and the heads of the priestly and Levite families—one family chosen for Eleazar, one for Ithamar. లేవీయులలో లేఖికునిగా ఉన్న నెతనేలు కుమారుడైన షెమయా, వారి పేర్లను రాజు, అతని అధికారులు యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు, యాజకుల కుటుంబ పెద్దలు, లేవీయుల ఎదుట నమోదు చేశాడు. ఒక కుటుంబం ఎలియాజరు నుండి, తర్వాత మరొక కుటుంబం ఈతామారు నుండి తీసుకోబడింది.
7 The first lot fell to Jehoiarib, the second to Jedaiah, మొదటి చీటి యెహోయారీబుకు, రెండవది యెదాయాకు,
8 the third to Harim, the fourth to Seorim, మూడవది హారీముకు, నాలుగవది శెయొరీముకు,
9 the fifth to Malchijah, the sixth to Mijamin, అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
10 the seventh to Hakkoz, the eighth to Abijah, ఏడవది హక్కోజుకు, ఎనిమిదవది అబీయాకు,
11 the ninth to Jeshua, the tenth to Shecaniah, తొమ్మిదవది యెషూవకు, పదవది షెకన్యాకు,
12 the eleventh to Eliashib, the twelfth to Jakim, పదకొండవది ఎల్యాషీబుకు, పన్నెండవది యాకీముకు,
13 the thirteenth to Huppah, the fourteenth to Jeshebeab, పదమూడవది హుప్పాకు, పద్నాలుగవది యెషెబాబుకు,
14 the fifteenth to Bilgah, the sixteenth to Immer, పదిహేనవది బిల్గాకు, పదహారవది ఇమ్మేరుకు,
15 the seventeenth to Hezir, the eighteenth to Happizzez, పదిహేడవది హెజీరుకు, పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,
16 the nineteenth to Pethahiah, the twentieth to Jehezkel, పందొమ్మిదవది పెతహయాకు, ఇరవయ్యవది యెహెజ్కేలుకు,
17 the twenty-first to Jachin, the twenty-second to Gamul, ఇరవై ఒకటవది యాకీనుకు, ఇరవై రెండవది గామూలుకు,
18 the twenty-third to Delaiah, and the twenty-fourth to Maaziah. ఇరవై మూడవది దెలాయ్యాకు, ఇరవై నాలుగవది మయజ్యాకు వచ్చాయి.
19 These were their appointed duties for serving in our Father's house, by the order Aaron their father gave them, as our Father of Israel had commanded him. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను వారికి నియమించిన నిబంధనల ప్రకారం, వారు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు వారు చేయాల్సిన సేవా క్రమం ఇది.
20 The rest of Levi's sons: of Amram's sons, Shubael; of Shubael's sons, Jehdeiah. లేవీ వారసులలో మిగిలినవారు: అమ్రాము కుమారుల నుండి: షూబాయేలు; షూబాయేలు కుమారుల నుండి: యెహెద్యాహు.
21 Of Rehabiah: of the sons of Rehabiah, Isshiah the first. రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.
22 Of the Izharites, Shelomoth; of the sons of Shelomoth, Jahath. ఇస్హారీయుల్లో నుండి: షెలోమోతు; షెలోమోతు కుమారుల నుండి: యహతు.
23 The sons of Hebron: Jeriah the first, Amariah the second, Jahaziel the third, Jekameam the fourth. హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
24 The sons of Uzziel: Micah; of the sons of Micah, Shamir. ఉజ్జీయేలు కుమారుడు: మీకా; మీకా కుమారుల నుండి: షామీరు.
25 The brother of Micah: Isshiah; of the sons of Isshiah, Zechariah. మీకా సోదరుడు: ఇష్షీయా; ఇష్షీయా కుమారుల నుండి: జెకర్యా.
26 The sons of Merari: Mahli and Mushi. The sons of Jaaziah: Beno. మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో.
27 The sons of Merari through Jaaziah: Beno, Shoham, Zaccur, and Ibri. మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
28 Of Mahli: Eleazar, who had no sons. మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.
29 Of Kish: the sons of Kish, Jerahmeel. కీషు నుండి: కీషు కుమారుడు: యెరహ్మెయేలు.
30 The sons of Mushi: Mahli, Eder, and Jerimoth. These were the Levites by their families. మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ కుటుంబాల ప్రకారం లేవీయులు.
31 They too cast lots, like their relatives the sons of Aaron, before King David, Zadok, Ahimelech, and the heads of the priestly and Levite families—the head of each family the same as his younger brother. వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]