Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Numbers 33 OTSA

Show OTSA only
Verse × ×
1 These are the stages of the Israelites' journey out of Egypt, by their divisions under Moses and Aaron's hand. ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు.
2 Moses wrote their starting points by stage, at our Father's command; these are their stages by starting points. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు:
3 They set out from Rameses on the fifteenth day of the first month, the day after Passover—the Israelites marched out boldly, in full view of all the Egyptians, ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు.
4 while the Egyptians buried all their firstborn, whom our Father had struck down among them, and on their gods our Father executed judgments. Not in this edition
5 The children of Israel set out from Rameses and camped at Succoth. ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు.
6 They set out from Succoth and camped at Etham, which is on the edge of the wilderness. వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు.
7 They left Etham, turned back to Pi-hahiroth, east of Baal-zephon, and camped before Migdol. వారు ఏతాము నుండి వెనుకకు తిరిగి బయల్-సెఫోను ఎదురుగా పీ హహీరోతు వైపుకు వెళ్లి మిగ్దోలు ఎదుట దిగారు.
8 They set out from before Hahiroth, crossed the sea into the wilderness, traveled three days through the wilderness of Etham, and camped at Marah. పీ హహీరోతు నుండి బయలుదేరి సముద్రం గుండా దాటుతూ ఎడారిలోకి చేరారు, వారు మూడు రోజులు ఏతాము ఎడారిలో ప్రయాణం చేసి మారాలో దిగారు.
9 They left Marah and reached Elim, where twelve water springs and seventy palm trees stood; there they camped. మారా నుండి బయలుదేరి ఎలీముకు వెళ్లారు, ఎలీములో పన్నెండు నీటి ఊటలు, డెబ్బయి ఈతచెట్లు ఉన్నాయి, వారక్కడ ఉన్నారు.
10 They set out from Elim and camped by Yam Suph. ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.
11 They set out from Yam Suph and camped in the wilderness of Sin. ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.
12 They set out from the wilderness of Sin and camped at Dophkah. సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.
13 They set out from Dophkah and camped at Alush. దోపకా నుండి బయలుదేరి ఆలూషుకు వచ్చారు.
14 They left Alush and camped at Rephidim, where the people had no water to drink. ఆలూషు నుండి బయలుదేరి రెఫీదీముకు వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.
15 They set out from Rephidim and camped in the wilderness of Sinai. రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు.
16 They set out from the wilderness of Sinai and camped at Kibroth-hattaavah. సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
17 They set out from Kibroth-hattaavah and camped at Hazeroth. కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.
18 They set out from Hazeroth and camped at Rithmah. హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు.
19 They set out from Rithmah and camped at Rimmon-perez. రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను పెరెజుకు వచ్చారు.
20 They set out from Rimmon-perez and camped at Libnah. రిమ్మోను పెరెజు నుండి బయలుదేరి లిబ్నాకు వచ్చారు.
21 They set out from Libnah and camped at Rissah. లిబ్నా నుండి బయలుదేరి రీసాకు వచ్చారు.
22 They set out from Rissah and camped at Kehelathah. రీసా నుండి బయలుదేరి కేహేలాతాకు వచ్చారు.
23 They set out from Kehelathah and camped at Mount Shepher. కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు.
24 They set out from Mount Shepher and camped at Haradah. షాపెరు పర్వతము నుండి బయలుదేరి హరాదాకు వచ్చారు.
25 They set out from Haradah and camped at Makheloth. హరాదా నుండి బయలుదేరి మకెలోతుకు వచ్చారు.
26 They set out from Makheloth and camped at Tahath. మకెలోతు నుండి బయలుదేరి తాహతుకు వచ్చారు.
27 They set out from Tahath and camped at Terah. తాహతు నుండి బయలుదేరి తారహుకు వచ్చారు.
28 They set out from Terah and camped at Mithkah. తారహు నుండి బయలుదేరి మిత్కాకు వచ్చారు.
29 They set out from Mithkah and camped at Hashmonah. మిత్కా నుండి బయలుదేరి హష్మోనాకు వచ్చారు.
30 They set out from Hashmonah and camped at Moseroth. హష్మోనా నుండి బయలుదేరి మొసేరోతుకు వచ్చారు.
31 They set out from Moseroth and camped at Bene-jaakan. మొసేరోతు నుండి బయలుదేరి బెనె యహకానుకు వచ్చారు.
32 They set out from Bene-jaakan and camped at Hor-haggidgad. బెనె యహకాను నుండి బయలుదేరి హోర్-హగ్గిద్గాదుకు వచ్చారు.
33 They set out from Hor-haggidgad and camped at Jotbathah. హోర్-హగ్గిద్గాదు నుండి బయలుదేరి యొత్బాతాకు వచ్చారు.
34 They set out from Jotbathah and camped at Abronah. యొత్బాతా నుండి బయలుదేరి ఎబ్రోనాకు వచ్చారు.
35 They set out from Abronah and camped at Ezion-geber. ఎబ్రోనా నుండి బయలుదేరి ఎసోన్-గెబెరుకు వచ్చారు.
36 They set out from Ezion-geber and camped in the wilderness of Zin, that is, Kadesh. ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు.
37 They left Kadesh and camped at Mount Hor, on the edge of Edom's land. కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు.
38 Aaron the priest climbed Mount Hor at our Father's command and died there in the fortieth year after the children of Israel left the land of Egypt, in the fifth month, on its first day. యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను హోరు పర్వతం మీద చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన నలభైయవ సంవత్సరం, అయిదవ నెల, మొదటి రోజున అతడు చనిపోయాడు.
39 Aaron was 123 years old when he died on Mount Hor. హోరు పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతని వయస్సు నూట యిరవై మూడు సంవత్సరాలు.
40 The Canaanite king of Arad, living in the Negev of Canaan, heard the Israelites were coming. కనాను దక్షిణ దిక్కున కనానీయుడైన అరాదు పట్టణ రాజు ఇశ్రాయేలీయులు వస్తున్నారని విన్నాడు.
41 They set out from Mount Hor and camped at Zalmonah. వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు.
42 They set out from Zalmonah and camped at Punon. సల్మానా నుండి బయలుదేరి పూనొనుకు వచ్చారు.
43 They set out from Punon and camped at Oboth. పూనొను నుండి బయలుదేరి ఓబోతుకు వచ్చారు.
44 They set out from Oboth and camped at Iye-abarim, on the border of Moab. ఓబోతు నుండి బయలుదేరి మోయాబు సరిహద్దులో ఉన్న ఈయ్యె-అబారీముకు వచ్చారు.
45 They set out from Iyim and camped at Dibon-gad. ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు.
46 They set out from Dibon-gad and camped at Almon-diblathaim. దీబోనుగాదు నుండి బయలుదేరి అల్మోన్-దిబ్లాతయీముకు వచ్చారు.
47 They set out from Almon-diblathaim and camped in the mountains of Abarim, near Nebo. అల్మోన్-దిబ్లాతయీము నుండి బయలుదేరి నెబో ఎదుట ఉన్న అబారీము పర్వతాల దగ్గర దిగారు.
48 They left the mountains of Abarim and camped on the plains of Moab, by the Jordan at Jericho. అబారీము పర్వతాల నుండి బయలుదేరి యెరికోకు దగ్గర యొర్దాను అవతలి వైపున మోయాబు సమతల మైదానాల్లో దిగారు.
49 They camped along the Jordan, from Beth-jeshimoth to Abel-shittim, on the plains of Moab. మోయాబు సమతల మైదానంలో బేత్-యెషిమోతు మొదలుకొని ఆబేల్-షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగారు.
50 Our Father spoke to Moses in the plains of Moab by the Jordan at Jericho, saying: యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు,
51 "Speak to the Israelites and tell them: When you cross the Jordan into the land of Canaan. “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,
52 Drive out everyone living in the land before you; destroy all their carved images and metal figures, and tear down all their high places. ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి.
53 Possess the land and live in it, for I have given you the land to possess. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించండి ఎందుకంటే మీరు స్వాధీనపరచుకోడానికి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను.
54 Divide the land by lot among your clans—more land to larger clans, less to smaller ones. Wherever the lot falls for someone, that becomes theirs. You will inherit by your ancestral tribes. చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి.
55 "But if you don't drive out the land's residents before you, those you leave will be barbs in your eyes and thorns in your sides, troubling you in the land where you live. “ ‘అయితే ఆ దేశవాసులను మీరు తరిమివేయకపోతే, అక్కడ ఉండడానికి అనుమతించిన వారు మీ కళ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలాలుగా చేసినవారవుతారు. మీరు నివసించే భూమిలో వారు మిమ్మల్ని కష్ట పెడతారు.
56 And then I will do to you what I had planned to do to them." అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]