Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Numbers 26 OTSA

Show OTSA only
Verse × ×
1 After the plague, our Father said to Moses and to Eleazar son of Aaron the priest, తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు,
2 "take a census of the whole Israelite community by ancestral house, everyone twenty and older able to serve in Israel's army." “ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.”
3 Moses and Eleazar the priest spoke with them on the plains of Moab, by the Jordan across from Jericho: కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ,
4 "Count the people twenty years old and up, as our Father commanded Moses." These were Israel's people who came from the land of Egypt: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు. వీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు:
5 Reuben, Israel's firstborn. Sons of Reuben: Hanoch, clan of the Hanochites; Pallu, clan of the Palluites, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం;
6 of Hezron, the clan of the Hezronites; of Carmi, the clan of the Carmites. హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; కర్మీ ద్వార, కర్మీయుల వంశము.
7 These are the clans of the Reubenites; they numbered 43,730. ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730.
8 The sons of Pallu: Eliab. పల్లు కుమారుడు ఏలీయాబు,
9 Eliab's sons: Nemuel, Dathan, and Abiram—the same Dathan and Abiram, community representatives who challenged Moses and Aaron in Korah's assembly, when they challenged our Father. ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.
10 The earth opened its mouth and swallowed them and Korah, when the company died and the fire consumed 250 men—they became a warning. భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.
11 But the sons of Korah did not die. అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు.
12 Simeon's sons by clan: Nemuel's, the Nemuelite clan; Jamin's, the Jaminite clan; Jachin's, the Jachinite clan, షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం;
13 of Zerah, the clan of the Zerahites; of Shaul, the clan of the Shaulites. జెరహు ద్వార, జెరహీయుల వంశం; షావూలు ద్వార, షావూలీయుల వంశము.
14 These are the clans of the Simeonites: 22,200. ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.
15 Gad's sons by clan: Zephon's clan, the Zephonites; Haggi's clan, the Haggites; Shuni's clan, the Shunites, గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; షూనీ ద్వార, షూనీయుల వంశం;
16 of Ozni, the clan of the Oznites; of Eri, the clan of the Erites; ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; ఏరీ ద్వార, ఏరీయుల వంశం;
17 of Arod, the clan of the Arodites; of Areli, the clan of the Arelites. అరోదు ద్వార, అరోదీయుల వంశం; అరేలీ ద్వార, అరేలీయుల వంశము.
18 These are the clans of the sons of Gad as they were numbered: 40,500. ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500.
19 Judah's sons were Er and Onan; Er and Onan died in the land of Canaan. యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.
20 Judah's sons by clan: from Shelah, Shelanite clan; from Perez, Perezite clan; from Zerah, Zerahite clan. యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.
21 Perez's sons: Hezron, clan of the Hezronites; Hamul, clan of the Hamulites. పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము.
22 These are the clans of Judah as they were numbered: 76,500. ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.
23 Issachar's sons by clan: Tola, clan of the Tolaites; Puvah, clan of the Punites, ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం;
24 of Jashub, the clan of the Jashubites; of Shimron, the clan of the Shimronites. యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము.
25 These are the clans of Issachar as they were numbered: 64,300. ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300.
26 Zebulun's sons by clan: from Sered, the Seredite clan; from Elon, the Elonite clan; from Jahleel, the Jahleelite clan. జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; యహలేలు ద్వార, యహలేలీయుల వంశము.
27 These are the clans of the Zebulunites as they were numbered: 60,500. ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500.
28 The sons of Joseph according to their clans were Manasseh and Ephraim. మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:
29 Manasseh's sons: Machir's clan, the Machirites; Machir fathered Gilead; Gilead's clan, the Gileadites. మనష్షే వారసులు: మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); గిలాదు ద్వార, గిలాదీయుల వంశము.
30 Sons of Gilead: Iezer, clan of Iezerites; Helek, clan of Helekites, గిలాదు వారుసులు: ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; హెలెకు ద్వార, హెలెకీయుల వంశం;
31 and of Asriel, the clan of the Asrielites; and of Shechem, the clan of the Shechemites; అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; షెకెము ద్వార, షెకెమీయుల వంశం;
32 and of Shemida, the clan of the Shemidaites; and of Hepher, the clan of the Hepherites. షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.
33 Zelophehad son of Hepher had no sons, only daughters: Mahlah, Noah, Hoglah, Milcah, and Tirzah. (హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)
34 These are the clans of Manasseh; they numbered 52,700. ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700.
35 These are Ephraim's descendants by family: Shuthelah, family of the Shuthelahites; Becher, family of the Becherites; Tahan, family of the Tahanites. ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; బేకరు ద్వార, బేకరీయల వంశం; తహను ద్వార, తహనీయుల వంశము.
36 And these are the sons of Shuthelah: of Eran, the clan of the Eranites. వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము.
37 These are the clans of Ephraim's sons, by their count: 32,500. These are Joseph's sons by their clans. ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500. వీరు వంశాల ప్రకారం యోసేపు వారసులు.
38 Benjamin's sons by clan: Bela, clan of the Belaites; Ashbel, clan of the Ashbelites; Ahiram, clan of the Ahiramites, బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;
39 of Shephupham, the clan of the Shuphamites; of Hupham, the clan of the Huphamites. షూఫాము ద్వార, షూఫామీయుల వంశం; హుఫాము ద్వార, హుఫామీయుల వంశము.
40 Bela's sons: Ard and Naaman—from Ard, the Ardite clan; from Naaman, the Naamite clan. అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము.
41 These are the sons of Benjamin by their clans; they numbered 45,600. ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600.
42 These were Dan's sons by clan: from Shuham, the Shuhamite clan. These were Dan's clans by clan. దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము. ఇవి దాను వంశాలు:
43 All the clans of the Shuhamites numbered 64,400. వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400.
44 Asher's sons by clan: Imnah, clan of the Imnites; Ishvi, clan of the Ishvites; Beriah, clan of the Beriites. ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం;
45 Sons of Beriah: Heber, clan of Heberites; Malchiel, clan of Malchielites. బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.
46 Asher had a daughter named Serah. ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.
47 These are the clans of the sons of Asher as they were numbered: 53,400. ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.
48 Naphtali's sons by clan: Jahzeel, clan of Jahzeelites; Guni, clan of Gunites, నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; గూనీ ద్వార, గూనీయుల వంశం;
49 of Jezer, the clan of the Jezerites; of Shillem, the clan of the Shillemites. యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము.
50 These are the clans of Naphtali; they numbered 45,400. ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400.
51 This was the total number of the people of Israel: 601,730. లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730.
52 Then our Father said to Moses, యెహోవా మోషేతో అన్నారు,
53 "Among these the land is to be divided for inheritance according to the number of names. “పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.
54 Give the larger group more land, the smaller less—each share sized to its census count. పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి.
55 But the land must be divided by lot; they will inherit according to their fathers' tribal names. చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది.
56 Their inheritance is to be apportioned by lot between the larger and the smaller." ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.”
57 These are the numbered Levites by their clans: Gershon's clan, the Gershonites; Kohath's clan, the Kohathites; Merari's clan, the Merarites. వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.
58 Levi's clans: Libnite clan, Hebronite clan, Mahlite clan, Mushite clan, Korahite clan. Kohath fathered Amram. ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము;
59 Amram's wife was named Jochebed, Levi's daughter, born to Levi in Egypt; she bore Amram Aaron, Moses, and their sister Miriam. అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.
60 And to Aaron were born Nadab and Abihu, Eleazar and Ithamar. అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.
61 But Nadab and Abihu died when they offered unauthorized fire before our Father. అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)
62 The Levites counted numbered 23,000, every male a month old and up. They were not counted among the Israelites, since no inheritance was given them among the Israelites. లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.
63 Moses and Eleazar the priest counted these on the plains of Moab by the Jordan, across from Jericho. యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు.
64 None of these had been counted by Moses and Aaron the priest in the wilderness of Sinai. వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.
65 For our Father had said of them, "They would surely die in the wilderness." None remained, except Caleb son of Jephunneh and Joshua son of Nun. ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]